12A Railway Colony: అల్లరి నరేష్ '12Aరైల్వే కాలనీ' ట్రైలర్ విడుదలైంది. ఫుల్ సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో సాగిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఇదొక.. సైకలాజికల్ హారర్, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ సినిమా అని తెలుస్తోంది. 12Aరైల్వే కాలనీలో వరుసగా దారుణమైన హత్యలు జరుగుతుంటాయి. ఈ కేసును ఛేదించడంలో హీరోకు కీలక పాత్ర పోషిస్తాడు. అసలు ఈ హత్యలకు కారణం ఎవరు? హీరోకి, ఈ కేసుకి ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలతో ట్రైలర్ ఉత్కంఠను పెంచింది. ఈ చిత్రంలో అల్లరి నరేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ లో భీమ్స్ నేపథ్య సంగీతం సన్నివేశాలు మరింత థ్రిల్లింగ్ గా, హైలైట్ గా అనిపించేలా చేసింది. మొత్తానికి అల్లరి నరేష్ '12ఎ రైల్వే కాలనీ' సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో నిండి ఉంటుందని తెలుస్తోంది.
Unbelievable questions. Unlimited twists and turns ❤️🔥
— Allari Naresh (@allarinaresh) November 11, 2025
Presenting the kirraak #12ARailwayColony trailer 💥💥
▶️ https://t.co/oHhiGjdJLx
Redefining thrills and chills in cinemas on Nov 21!#12ARailwayColonyOnNov21stpic.twitter.com/Rfyk6W4p88
నవంబర్ 21న విడుదల
పోలిమేర, పోలిమేర 2 చిత్రాల ఫేమ్ డా. అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. డెబ్యూ డైరెక్టర్ నాని కసరగడ్డ దర్శకత్వం వహించారు. కామాక్షి భాస్కర్ల కథానాయికగా నటించగా.. సాయి కుమార్, వివా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న హీరో అల్లరి నరేష్ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కేవలం 41 రోజుల్లోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసినట్లు తెలిపారు.
Also Read: Kate Sharma: ఉఫ్.. టూ పీస్ బికినీలో హీరోయిన్ బోల్డ్ ఫొటో షూట్! ఈ పిక్స్ చూస్తే అంతే
Follow Us