సూపర్ స్టార్ హెల్త్ అప్డేట్.. రజనీకాంత్ కు స్టెంట్ వేసిన డాక్టర్స్
కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్‌కు శస్త్రచికిత్స పూర్తయినట్లు తెలుస్తోంది. వైద్యులు ఆయన పొత్తికడుపులో స్టెంట్ వేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.