'దేవర' హిట్టా.. ఫట్టా? అసలు నిజం ఇదే 'దేవర' మూవీ ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ అందుకుంది. ఈ మూవీ కేవలం యాక్షన్ లవర్స్ కు మాత్రమే అనే టాక్ ఎక్కువగా వినిపించింది. సగటు ప్రేక్షకుడిని మాత్రం పూర్తీ స్థాయిలో మెప్పించలేదని కొందరి వాదన. సినిమా హిట్టా? ఫట్టా? అనేది ఈ ఆర్టికలో తెలుసుకోండి. By Anil Kumar 01 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'దేవర' సెప్టెంబర్ 27 న థియేటర్స్ లో రిలీజైన విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఫ్యాన్స్ మాత్రం బ్లాక్ బస్టర్ అంటూ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. కలెక్షన్స్ విషయానికొస్తే.. టాక్ తో సంబంధం లేకుండా మూడు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. యాక్షన్ లవర్స్ కు మాత్రమే.. SSR Curse break ayyindi ani ruddhalante Movie Hit ani cheppukovaali..Collections yenduku thaggay ante Disaster talk ani cheppukovaali..Baley dorikaaru ra Tygors 😂#Devara pic.twitter.com/joiHiL6f70 — John Wick 🚁 (@JohnWick_fb) September 29, 2024 నిజానికి ఈ మూవీ కేవలం యాక్షన్ లవర్స్ కు మాత్రమే అనే టాక్ ఎక్కువగా వినిపించింది. ముఖ్యంగా బీ,సీ సెంటర్స్ లో ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సగటు ప్రేక్షకుడిని మాత్రం సినిమా పూర్తీ స్థాయిలో మెప్పించలేదని కొందరి వాదన. నిజం చెప్పాలంటే కొరటాల శివ గత సినిమాలకు 'దేవర' సినిమాకు ఏమాత్రం సంబంధం ఉండదు. ఆయన సినిమాల్లో ఉండే సోషల్ మెసేజ్ 'దేవర' లో మిస్ అయింది. Part 2 AVASARAMA antunnaru , but unanswered questions ala cheppakunnda end chesaru🙊How did Muragan Died ?🤷🏼Police officer tulasi injuries?🤷🏼Who is Daya and Yeti ?🫨Whose skeletons are under water ..?🫨🫨Prakash Raj Character????????🙊Strongest Devara who killed all when… pic.twitter.com/9Cl8GLlyE2 — ALTDHFM (@altSsmb5) September 27, 2024 Also Read : గేమ్ ఛేంజర్' సాంగ్.. చరణ్ డ్యాన్స్ పై సమంత కామెంట్ వైరల్ దాంతో పాటూ ఇందులో కథ కూడా కొత్తదేమీ కాదు. సినిమాలో కొరటాల మార్క్ మిస్ అయిందని క్లియర్ గా కనిపిస్తుంది. ఫస్టాఫ్ వరకు తన స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసిన కొరటాల.. సెకండాఫ్ మాత్రం ఆ మ్యాజిక్ ను కంటిన్యూ చేయలేకపోయాడు. దానికి తోడు క్లైమాక్స్ మొత్తం తేలిపోయింది. అలాగే దేవర పార్ట్-2 కు కావాల్సిన సరైన లీడ్స్ ను ఇవ్వలేకపోయారు. దీంతో కథ మొత్తం పార్ట్-1 లోనే చెప్పేస్తే ఇంకా పార్ట్ -2 లో ఏం చెప్తారో అన్న కన్ఫ్యూజన్ కూడా ఆడియన్స్ లో ఉండిపోయింది. Congratulations 👏🎉 brother ❤️🔥#Devara pic.twitter.com/WcGs52wisr — NTR THE MASTERPIECE 💥💥 (@kumar_tarakian) September 28, 2024 సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుద్ బీజియం, యాక్షన్ సీన్స్, విజువల్స్ హైలైట్స్ అని చెప్పొచ్చు. అందుకే స్టోరీ, టాక్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు దసరా వరకు పెద్ద సినిమాల హడావిడి లేదు కాబట్టి, వసూళ్ల పరంగా అప్పటి వరకు 'దేవర' కు తిరుగులేదు. ఇప్పటికే సినిమా బ్రేక్ ఈవెన్ కు చాలా దగ్గరలో ఉంది. మరో వారం రోజుల్లో లాభాల బాట పట్టే ఛాన్స్ ఉంది. సో కలెక్షన్స్ ప్రకారం చూసుకుంటే 'దేవర' హిట్ మూవీ అని చెప్పొచ్చు. Devara day 2 public talk: Unanimous ga ummutunna kuda Blockbuster Ani ruddukuntuEstamochina numbers tho fake collections vesukuntunnaru Edi kuda vaka bratukena @tarak9999 anna pic.twitter.com/btbjKdNSTM — .🚁 (@someshRC_) September 29, 2024 #devara #ntr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి