చేతిలో పేలిన తుపాకీ.. ప్రముఖ నటుడి ఆడియో క్లిప్ వైరల్..!

నటుడు గోవిందాకు గన్‌ మిస్‌ఫైర్‌ కావడంతో గాయాలయ్యాయి. చికిత్స తర్వాత గోవింద తన హెల్త్ అప్డేట్ ను అభిమానులతో పంచుకున్నారు. తల్లిదండ్రులు, అభిమానుల, ఆశీర్వాదాలే తనను రక్షించాయన్నారు. బుల్లెట్ బయటకు తీశారని.. తాను క్షేమంగా ఉన్నానని చెప్పారు.

New Update
govinda actor

actor govinda

Actor Govinda :బాలీవుడ్ నటుడు గోవిందా పెను ప్రమాదం తప్పింది.  ఇంట్లో తన సొంత లైసెన్స్‌డ్  గన్ చెక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలింది. ఈ ప్రమాదం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగింది. బుల్లెట్ శబ్దం వినిపించడంతో ఇంటి సభ్యులు ఆయన గదిలోకి వెళ్లి చూడగా.. గన్ నుంచి పేలిన బుల్లెట్ ఆయన  ఎడమ కాలికి తగిలింది. దీంతో వెంటనే గోవిందాను ముంబై లోని క్రిటీ కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు కాలి నుంచి బులెట్ తొలగించగా.. ప్రమాదం నుంచి బయట పడ్డారు. 

హెల్త్ అప్డేట్ పంచుకున్న గోవిందా 

చికిత్స అనంతరం గోవింద తన హెల్త్ అప్డేట్ ను అభిమానులతో పంచుకున్నారు. ''తల్లిదండ్రులు, అభిమానుల, ఆశీర్వాదాలే తనను రక్షించాయన్నారు. బుల్లెట్ బయటకు తీశారని.. తాను క్షేమంగా ఉన్నానని చెప్పారు. ఇక్కడి వైద్యులకు,  అభిమానుల ప్రార్థనలకు ధన్యవాదాలు" అని  ఆసుపత్రి నుంచి ఆడియో క్లిప్ రిలీజ్ చేశారు.  ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఉన్నారు.  దీంతో గోవిందా అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. 

Also Read:  Kalinga: ఓటీటీలో భయపెట్టేందుకు వచ్చేస్తున్న హార‌ర్ ఫాంట‌సీ థ్రిల్ల‌ర్‌!

Advertisment
తాజా కథనాలు