/rtv/media/media_files/9x9LZOo6EtRNupf0sqQ9.jpg)
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా 'దేవర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తారక్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు 'దేవర' మ్యానియాలో మునిగితేలుతున్నారు. అయితే ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్.. 'సలార్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నారు. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.
హీరోయిన్ దొరికేసింది..
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దాని ప్రకారం.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సప్తసరాగాలు దాటి ఫేం రుక్మిణి వసంత్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించనుందట. ఇప్పటికే మూవీ టీమ్ ఆమెను ఫైనల్ చేసినట్లు టాక్.
#NTRNeel Buzz
— Manobala Vijayabalan (@ManobalaV) September 30, 2024
Rukmini Vasanth female lead. pic.twitter.com/2K8aZ62dbu
అంతేకాదు బంగ్లాదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో ఈ సినిమా ఉండబోతున్నట్టు ఇంకో వార్త వైరల్ అవుతోంది. బంగ్లాదేశ్‌కు వలస వెళ్లిన తెలుగు వాళ్లకు అండగా నిలిచే పాత్రలో తారక్ కనిపిస్తాడని అంటున్నారు. ఇందులో నిజం ఎంత అనేది తెలీదు కానీ.. త్వరలోనే హీరోయిన్ విషయమై మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం.
#NTRNeel film is set in the backdrop of Bangladesh. #NTR stands for the Telugu community who migrated to Bangladesh and this forms the rest of the story. #Devara #JrNTR #ManofMassessNTR pic.twitter.com/ycV2ZpqkbS
— CHITRAMBHALARE (@chitrambhalareI) September 30, 2024
#NTR Neel అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ సినిమాకు 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.