Devara: నాలుగవ రోజు దారుణంగా పడిపోయిన దేవర కలెక్షన్స్.. ఏకంగా..! ఎన్టీఆర్ 'దేవర' నాలుగవ రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. సండే తో పోలిస్తే.. దాదాపు 68 శాతం డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. సక్నిల్క్ నివేదిక ప్రకారం నాలుగో రోజు ఈ చిత్రం రూ. 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. By Archana 01 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update devara day 4 collections షేర్ చేయండి Devara day 4 collections: ఎన్టీఆర్ 'దేవర' తొలిరోజు బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్స్ సాధించింది. తొలిరోజు ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలను అందుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. తొలి మూడు రోజుల్లో ఈ మూవీ రూ.266 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నాలుగవ రోజు పడిపోయిన 'దేవర' కలెక్షన్స్ అయితే ఈ చిత్రం కలెక్షన్స్ లో తొలి రోజు నుంచి వరుసగా డ్రాప్ కనిపిస్తోంది. తొలి రోజు దేశవ్యాప్తంగా రూ. 80 కోట్లు కలెక్ట్ చేయగా.. రెండవ రోజు రూ. 38.2 కోట్లు, మూడవ రోజు రూ. 40 కోట్లు సాధించింది. శుక్రవారంతో పోలిస్తే శని, ఆదివారాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక సోమవారం( నాలుగవ రోజు) ఈ సినిమా కలెక్షన్స్ మరింత పడిపోయాయి. సండే తో పోలిస్తే దాదాపు 68 శాతం టికెట్ సెల్స్ డ్రాప్ అయ్యాయి. సక్నిల్క్ ప్రకారం నాలుగవ రోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ. 12.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. తెలుగు నుంచి రూ.8 కోట్లు, హిందీ వెర్షన్ నుంచి రూ.4 కోట్లు రాబట్టింది. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా హాలీడే కావడంతో మళ్ళీ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. మొదటి మూడు రోజుల్లో ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ.171 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కథానాయికగా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా పవర్ ఫుల్ రోల్ పోషించారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, శ్రుతి మరాఠే, షైన్ టామ్ చాకో, నారాయణ్, కలైయరసన్, మురళీ శర్మ, అజయ్, అభిమన్యు సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ ఈ మూవీకి మరింత హైలైట్ గా నిలిచింది. Also Read: గేమ్ చేంజర్ నుంచి 'రా మచ్చ మచ్చ' సాంగ్.. దుమ్ములేపిన రామ్ చరణ్..! #devara #ntr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి