సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. తీవ్ర కడుపునొప్పితో సోమవారం ఆయన ఆసుపత్రిలో చేరారు. దీంతో అభిమానులు ఆయనకు ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే నేటి ఉదయం ఆయనకు శస్త్రచికిత్స పూర్తయినట్లు తెలుస్తోంది. వైద్యులు ఆయన పొత్తికడుపులో స్టెంట్ వేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
మూడు రోజుల్లో డిశ్చార్జ్..
మరో మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు రజనీ ఆరోగ్యంపై ఆయన భార్య లతా స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. ఇక సూపర్ స్థార్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
#Latest update on #SuperstarRajinikanth’s health @rajinikanth has successfully undergone an elective procedure during which a stent was placed near his lower abdominal area. The procedure was carried out by a team of three specialty doctors in a cath lab. Currently, he is… pic.twitter.com/aulGY3Opcn
— Sreedhar Pillai (@sri50) October 1, 2024
Also Read : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు హీరోయిన్ దొరికేసింది.. ఎవరంటే?
ఇక రజినీకాంత్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన వెట్టయాన్, కూలీ సినిమాలు చేస్తున్నారు. వీటిలో 'వెట్టయాన్' దసరా కానుకగా అక్టోబర్ 10 న రిలీజ్ కానుంది. 'జై భీం' మూవీ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు.