Matka Movie
Matka Release Date: ప్రస్తుతం మెగా హీరో వరుణ్ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన గని, గాండీవధారి అర్జున సినిమాలతో పాటు ఇటీవలే వచ్చిన 'ఆపరేషన్ వాలెంటైన్' కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలో మెగా హీరో 'మట్కా' అంటూ మరో సరికొత్త పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను ముందుకు రాబోతున్నాడు.
మట్కా
1950, 1980 కాలం నాటి కథాంశంతో పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి 'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లిమ్ప్స్ వీడియోలో.. ఆ కాలం నాటికి తగ్గట్లు వరుణ్ తేజ్ లుక్, డ్రెస్సింగ్ స్టైల్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు.
మట్కా రిలీజ్ డేట్..
తాజాగా 'మట్కా' మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నవంబర్ 14న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ చిత్రంలో వరుణ్ సరసన మీనాక్షి చౌదరీ, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు.
The game is set!
— Varun Tej Konidela (@IAmVarunTej) October 1, 2024
Coming on November 14th 2024. 🎲 #MATKA pic.twitter.com/Py3bKAYWm3
వైరా, SRT ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: Devara: నాలుగవ రోజు 'పడిపోయిన' దేవర కలెక్షన్స్.. ఏకంగా 68శాతం డ్రాప్!