actor govinda
Actor Govinda : బాలీవుడ్ నటుడు గోవిందా పెను ప్రమాదం తప్పింది. ఇంట్లో తన సొంత లైసెన్స్‌డ్ గన్ చెక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలింది. ఈ ప్రమాదం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగింది. బులెట్ శబ్దం వినిపించడంతో ఇంటి సభ్యులు ఆయన గదిలోకి వెళ్లి చూడగా.. గన్ నుంచి పేలిన బుల్లెట్ ఆయన ఎడమ కాలికి తగిలింది. దీంతో వెంటనే గోవిందాను ముంబై లోని క్రిటీ కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు కాలి నుంచి బులెట్ తొలగించగా.. ప్రమాదం నుంచి బయట పడ్డారు. ప్రస్తుతం గోవిందా ఇంకా స్పృహలోకి రానట్లుగా తెలుస్తోంది.
Also Read : అమెరికా సరిహద్దుల్లోకి దూసుకొచ్చిన రష్యా ఫైటర్ జెట్!