ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు.. కలెక్షన్స్ లో చరిత్ర సృష్టించిన 'పుష్ప2'
'పుష్ప2' సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.దీంతో ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమా సాధించని విధంగా తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా ‘పుష్ప2: ది రూల్’ నిలిచింది.