/rtv/media/media_files/2024/11/07/ZdZnWbzzdhbD8bXHXoVj.jpg)
Aishwarya Rai Abhishek Bachchan
Aishwarya Rai- Abhishek: గత కొన్ని రోజులుగా బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ మధ్య విభేదాలు వచ్చాయని, ఇద్దరు మధ్య విడాకులు తీసుకోబోతున్నారని నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు పలు ఈవెంట్లకు, పార్టీలకు వీరిద్దరి విడివిడిగా కనిపించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఐశ్వర్య, అభిషేక్ కూడా ఈ రూమర్ల పై ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
Also Read: బాలీవుడ్ లో పుష్ప మేనియా.. పుష్ప రాజ్ దెబ్బకు షారుఖ్, సల్మాన్ రికార్డ్స్ బ్రేక్
విడాకుల పై క్లారిటీ
ఈ క్రమంలో తాజాగా ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోతో ఐశ్వర్య, అభిషేక్ విడాకుల రూమర్లకు చెక్ పెట్టారు. గురువారం రాత్రి వీరిద్దరూ కలిసి ఒక పార్టీకి హాజరయ్యారు. అక్కడ ఐశ్వర్య, అభిషేక్ సీనియర్ నటి అయేషా జుల్కాతో కలిసి సెల్ఫీకి ఫోజులిచ్చారు. దీంతో ఇన్నాళ్లుగా విడాకులు అంటూ వస్తున్న రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది. ఈ పార్టీలో ఐశ్వర్య రాయ్ తల్లి బృందా రాయ్ కూడా తన కుమార్తె మరియు అల్లుడితో ఫోటోలు దిగడం కనిపించింది. చిత్ర నిర్మాత అను రంజన్ ఈ ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఇది ఇలా ఉంటే ఇటీవలే జరిగిన పారిస్ 'ఫ్యాషన్' వీక్ లో ఐశ్వర్య రాయ్ తమ వెడ్డింగ్ రింగ్ ధరించి కనిపించడం విడాకుల రూమర్లకు పరోక్షంగా చెక్ పెట్టింది. అయినప్పటికీ వీరి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విడాకుల ప్రచారం జరుగుతూనే వచ్చింది.
Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్