/rtv/media/media_files/2024/12/06/u0neObbkqep5ZHKM0CUI.jpg)
'పుష్ప ది రైజ్' తో అల్లు అర్జున్ కు నార్త్ లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు 'పుష్ప2' తో ఆ క్రేజ్ పీక్స్ కు చేరింది. నిన్న ప్రపంచ వ్యాప్తంగా 'పుష్ప2' మూవీ రిలీజై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా బాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
'పుష్ప2' హిందీలో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. బాలీవుడ్‌లో ఇప్పటి వరకు మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా షారుఖ్ ఖాన్ 'జవాన్' రూ. 65.5 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. అయితే, ఇప్పుడు 'పుష్ప2' ఆ రికార్డ్‌ను దాటేసింది. ఈ విషయాన్ని మేకర్స్ పోస్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు.
HISTORY MADE in INDIAN CINEMA ❤🔥#Pushpa2TheRule is HIGHEST DAY 1 OPENING HINDI FILM EVER with a Nett of 72 CRORES 💥💥💥#RecordsRapaRapAA 🔥
— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024
RULING IN CINEMAS
Book your tickets now!
🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpa
Icon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/0Ed23geibT
Also Read : 'పుష్ప2' తర్వాత బన్నీకి సినిమాల్లేవ్.. కారణం ఇదే?
మొదటి రోజే అన్ని కోట్లా?
హిందీలో ఫస్ట్ డే రూ.72 కోట్ల నెట్ రాబట్టి ఫస్ట్ ప్లేస్‌లోకి పుష్ప2 చేరిపోయింది. ఒక తెలుగు సినిమాకు కేవలం హిందీలో ఈ రేజ్ కలెక్షన్స్ రావడం అంటే అది మాములు విషయం కాదు. దీన్ని బట్టి చూస్తే నార్త్ లో అల్లు అర్జున్ ప్యూర్ డామినేషన్ కనిపిస్తోంది.
ఈ ఊపు చూస్తుంటే 'పుష్ప2' ఫుల్ రన్ లో రూ.500 కోట్ల వరకు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా హిందీ బాక్సాఫీస్ దగ్గర 'పుష్ప2' తర్వాత టాలీవుడ్ నుంచి బాహుబలి2 ( 41 కోట్లు), ఆదిపురుష్ ( రూ 37.25 కోట్లు), సాహో ( రూ.24.4 కోట్లు), కల్కి (రూ. 22.5 కోట్లు) వంటి చిత్రాలు ఉన్నాయి.
Also Read : సుకుమార్ ఆ సినిమాను మొదట బన్నీతో చేయాలనుకున్నాడా?
Also Read : 'పుష్ప2' తర్వాత బన్నీకి సినిమాల్లేవ్.. కారణం ఇదే?
Also Read: Rashmika: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప2' చూసిన రష్మిక..