Rashmika: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప2' చూసిన రష్మిక.. ఫొటో వైరల్

రష్మిక మందన తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కనిపించింది. గురువారం సాయంత్రం AMB లో విజయ్ దేవరకొండ తల్లి, తమ్ముడితో కలిసి 'పుష్ప 2' సినిమాను చూసింది. అందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

New Update
rashmika01

టాలీవుడ్ ఆన్ స్క్రీన్ పెయిర్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన రిలేషన్‌లో ఉన్నట్లు ఎంతో కాలం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. విజయ్ వెకేషన్ వెళ్లే ప్లేస్ కు రష్మిక కూడా వెళ్లడం, విజయ్ ఇంట్లోనే ప్రతి పండగను జరుపుకోవడం లాంటివి ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. 

పైకి ఈ జంట ఫ్రెండ్స్ అంటూ చెబుతున్నా.. ఫ్యాన్స్ మాత్రం వీళ్ళు సీక్రెట్ రిలేషన్ మైంటైన్ చేస్తున్నారని చెప్తుంటారు. అయితే రీసెంట్ గా చెన్నైలో జరిగిన 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పెళ్లి, ప్రియుడి గురించి టాపిక్ రాగానే రష్మిక తెగ సిగ్గుపడిపోయింది. నేను చేసుకోబోయేది ఎవరో మీకు కూడా తెలుసుగా! అని సమాధానమిచ్చింది. అంటే విజయ్ దేవరకొండ అని పరోక్షంగా కన్ఫర్మ్ చేసింది. 

Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్

Also Read : 'పుష్ప2' తర్వాత బన్నీకి సినిమాల్లేవ్.. కారణం ఇదే?

గుడ్ న్యూస్ చెప్తారా?

ఇక ఇప్పుడు ఏకంగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి 'పుష్ప 2' సినిమా చూసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్‌లో బన్నీతో 'పుష్ప2' ప్రీమియర్ చూసిన రష్మిక.. మరుసటి రోజు గురువారం సాయంత్రం AMB లో విజయ్ దేవరకొండ తల్లి, తమ్ముడితో కలిసి సినిమా చూసింది. 

అందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తే త్వరలో విజయ్-రష్మిక గుడ్ న్యూస్ చెప్తారేమో అనిపిస్తుంది. రౌడీ హీరో ఫ్యాన్స్ కూడా ఫొటో చూసి గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నామని నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

Also Read : సుకుమార్ ఆ సినిమాను మొదట బన్నీతో చేయాలనుకున్నాడా?

publive-image

Also Read: అల్లు అర్జున్‌కు ఊహించని షాక్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు