/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/allu-arjun-jpg.webp)
Allu Arjun: అల్లు అర్జున్ కు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే 'పుష్ప-2' ప్రీమియర్ షో నాడు ఓ మహిళా తొక్కిసలాటలో మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పై హుస్నాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ లో మరో ఫిర్యాదు అందింది. అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని హుస్నాబాద్ నియోజకవర్గ బీఎస్పీ ఇంఛార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈనెల 4న 9:30కు ప్రీమియర్ షో సందర్భంగా చిక్కడపల్లిలోని సంధ్య థియేటర్ కు ఎలాంటి అనుమతులు లేకుండా అల్లు అర్జున్ రావడం వల్లే మహిళ మృతి చెందిందని.. ఆమె మృతికి కారణం అల్లు అర్జున్ అని.. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు రవీందర్ గౌడ్ తెలిపారు.
Also Read : 'పుష్ప2' తర్వాత బన్నీకి సినిమాల్లేవ్.. కారణం ఇదే?
పుష్ప-2 ఎఫెక్ట్.. నో బెనిఫిట్ షో..
పుష్ప-2 మూవీ లిరీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. ఈ విషాద ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని సినిమాటోగ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తోపాటు బెనిఫిట్ షోలో చూడటానికి సంధ్య థియేటర్ కు వచ్చారు. ఆయన్ని చూడటానికి అభిమానులుందరూ ఒక్కసారిగా ఎగబడ్డారు. అందులో తొక్కిసలాటై రవళి అనే మహిళ చనిపోయింది.
ఇది కూడా చదవండి : కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డ్ .. ఇందులో స్పెషాలిటీ ఇదే..!
ఆ సంఘటన బాధ కలిగించింది
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన బాధ కలిగించిందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రేవతి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఇకనుంచి బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వమని తేల్చి చెప్పారు. హీరోలు అలాంటి టైంలో వెళ్ళడం కరెక్టేనా?, చట్ట పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. హీరో, చిత్ర యూనిట్ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.
Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప2' చూసిన రష్మిక.. ఫొటో వైరల్