/rtv/media/media_files/2024/12/06/k0xDtxfUyqAEpf8diXIg.jpg)
'పుష్ప-2' మూవీ లిరీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. హైదరాబాద్‌లోని RTC క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్‌లో బుధవారం రాత్రి ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో ఫ్యాన్స్ భారీగా వచ్చారు.
ఇది కూడా చదవండి: నిఖేశ్‌కుమార్ ఫ్రెండ్ లాకర్‌లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు!
దీంతో థియేటర్ ముందు తొక్కిలసట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ కిందపడిపోయారు. పోలీసులు వారిని గమనించి సీపీఆర్ చేసిన ఫలితం దక్కలేదు. దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రేవతి కన్నుమూసింది.
ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్న శ్రీతేజ్ కుటుంబాన్ని బన్నీటీం, మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ పరామర్శించారు. వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప2' చూసిన రష్మిక.. ఫొటో వైరల్
Also Read: ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం.. ఇకపై!