Bigg Boss Telugu 8
Bigg Boss 8 Telugu: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. ఇప్పటికే 13 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఇంకా కేవలం 2 వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే అవినాష్ టికెట్ టూ ఫినాలే టాస్క్ గెలిచి బిగ్ బాస్ సీజన్ 8 మొదటి ఫైనలిస్ట్ స్థానం సంపాదించుకున్నాడు. ఇక ఈ వారం నబీల్, ప్రేరణ, రోహిణి, నిఖిల్, విష్ణుప్రియా, గౌతమ్ నామినేషన్స్ లో ఉండగా.. వీళ్ళలో టాప్ 5కి వెళ్ళేది ఎవరు..? బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కాబోయేది ఎవరనే దాని పై నెట్టింట రకరకాల అభిప్రాయలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హౌస్ లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. టాప్ 5కి వెళ్ళేది ఐదుగురే కావున.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశం ఉంది.
Also Read: ఓవర్సీస్‌లో పుష్ప 2 వైల్డ్ ఫైర్.. రప్పా రప్పా లాడించిన బన్నీ
గౌతమ్, విష్ణుప్రియ ఎలిమినేటెడ్..
సోషల్ మీడియాలో టాక్ ప్రకారం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో ప్రేరణ, విష్ణుప్రియ బయటకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే విష్ణు ప్రియా హౌస్ లో ఎలాంటి మాస్క్ లేకుండా జెన్యూన్ గా ఉన్నప్పటికీ.. టాస్కుల పరంగా అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేపోయింది. విష్ణుప్రియతో పోలిస్తే మిగిలిన కంటెస్టెంట్స్ టాస్కుల్లో కాస్త ఎక్కువగా కనిపించారు. దీని కారణంగా విష్ణు ప్రియా ఓటింగ్ తగ్గే అవకాశం ఉన్నట్లు ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక ప్రేరణ విషయానికి వస్తే.. ప్రేరణ టాస్కుల్లో ఆడపులిలా విరుచుకుపడుతుంది. అబ్బాయిలకు ఏ మాత్రం తగ్గకుండా టఫ్ ఫైట్ ఇస్తుంది. కానీ ఈ వారం నబీల్ తో గొడవ, ఓట్ అపీల్ టాస్కులో సంచాలకుడి అవినాష్, నిఖిల్ విషయంలో ప్రేరణ సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోవడం ఆమె ఓటింగ్ పై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని టాక్. వీరిద్దరితో పాటు రోహిణి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
టాప్ 5కి వెళ్ళేది వీళ్ళే
ఇక టాప్ విషయానికి వస్తే.. అవినాష్ తో పాటు గౌతమ్, నిఖిల్, నబీల్ పక్కా టాప్ 5లో ఉంటారు. ఇంకా మిగిలిన ఆ ఒక్కరు ఎవరు అనే దానిపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రేరణ, విష్ణు, రోహిణి ఈ ముగ్గురిలో ఒక్కరికి మాత్రమే ఆ ఛాన్స్ ఉంది. అయితే ఈ ముగ్గురిలో ప్రేరణ టాప్ 5 కి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ప్రేక్షకుల అభిప్రాయం.
Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్