Yamini: హిందువా? ముస్లిమా? అద్దె ఇంటి కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!
అద్దె ఇళ్లు దొరకడం కష్టంగా మారిందని నటి యామినీ మల్హోత్రా ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇంటి ఓనర్స్ హిందువా? ముస్లిమా? మాంసం తింటావా? అని అడుగుతున్నారని వాపోయింది. నటి అంటే చాలు భయపడుతున్నారని, 2025లో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారంటూ అసహనం వ్యక్తం చేస్తోంది.