Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ దాడి కేసులో మరో ట్విస్ట్.. ఎవరీ కొత్త వ్యక్తి..?

సైఫ్ అలీఖాన్ దాడి కేసులో మరో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. సైఫ్ అలీఖాన్‌ లీలావతి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యేటప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్ అఫ్సర్ జైదీ సంతకం చేశాడు. ఎవరా అఫ్సర్ జైదీ అని చాలామందికి సందేహాలు కలుగుతున్నాయి. సైఫ్ వెంట అసలు హాస్పిటల్‌కు ఎవరు వచ్చారు..?

New Update
SAIF ALI KHAN A

SAIF ALI KHAN A Photograph: (SAIF ALI KHAN A)

Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు విచారణలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడి తర్వాత సైఫ్ అలీఖాన్‌ లీలావతి హాస్పిటల్‌లో(Lilavati Hospitals) అడ్మిట్ అయ్యేటప్పుడు అతని వెంట ఫ్యామిలీ ఫ్రెండ్ అఫ్సర్ జైదీ(Afsar Zaidi) ఉన్నట్లు తెలుస్తోంది. హాస్పిటల్ రికార్డ్‌లో అఫ్సర్ జైదీ సంతకం ఉంది. దుండగుడు కత్తితో దాడి చేసిన తర్వాత సైఫ్‌ను ఎవరూ హాస్పిటల్‌కు తీసుకెళ్లారని అనేక సందేహాలు ఉన్నాయి. ఇబ్రహీం అలీఖాన్, తైమూర్ అలీఖాన్ ఇద్దరు కుమారుల్లో ఎవరు హాస్పిటల్‌కు వెళ్లారని ఫస్ట్ గందరగోళం నెలకొంది. తర్వాత వీరితోపాటు మరో పేరు కూడా వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి:ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు స్పాట్

సైఫ్ అలీఖాన్‌ను హాస్పిటల్‌లో చేర్పించాక అఫ్సర్ జైదీ అక్కడికి చేరుకున్నానని క్లారిటీ ఆయన ఇచ్చారు. సైఫ్ అలీఖాన్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యేటప్పుడు చిన్న కొడుకు తైమూర్ అలీ ఖాన్(8) వెంట ఉన్నాడని పోలీసులకు నిర్ధారణ . ఇప్పుడు మరో డౌడ్ రేస్ అవుతుంది. మరి హాస్పిటల్ రిజిస్టర్‌లో అఫ్సర్ జైదీ పేరు ఎందుకు ఉందని అనుమానాలు వస్తున్నాయి. తైమూర్ అలీ ఖాన్ మైనర్ కాబట్టి.. తన ఏజ్ హాస్పిటల్‌లో జాయిన్ చేసేటప్పుడు డిక్లరేషన్ కోసం సరిపోదని.. అఫ్సర్ జైదీ సంతకం చేసిఉంటాడా అని అనుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: MEGHA Fraud: తెలంగాణలో మేఘా పెట్టుబడుల వెనుక సీక్రెట్ ఇదే.. అసలు బాగోతం బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే!

ఎవరీ అఫ్సర్ జైదీ..?

దాడి జరిగిన రోజే అఫ్సర్ జైదీ లీలావతి హాస్పిటల్‌కు చేరుకున్నట్లు.. అది సైఫ్ అలీఖాన్‌తోపాటు కాదని అఫ్సర్ జైదీ మీడియాతో చెప్పారు. దీంతో అసలు ఎవరా అఫ్సర్ జైదీ అని చాలామంది అనుకుంటున్నారు. సైఫ్ అలీ ఖాన్, హృతిక్ రోషన్‌ల బిజినెస్ పార్ట్‌నర్ అని ఊహాగానాలు వస్తున్నాయి. అదే విధంగా సెలబ్రిటీలకు అత్యంత దగ్గరి వ్యక్తి అని ఆయన పేరు వినిపిస్తోంది. పటౌడీ ఫ్యామిలీకి బాగా కావాల్సిన వ్యక్తి అని కొందరు భావిస్తు్న్నారు. ఏదేమైనా సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో మరో కొత్త పేరు వినిపిస్తోంది.

Also Read : భర్తతో విడిపోతున్న మరో హీరోయిన్.. ఫొటోలు డిలీట్!

Also Read : నాలుగో రోజు కంటిన్యూ .. దిల్ రాజు ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు

Advertisment
తాజా కథనాలు