80- 105 కిలోల బరువు
శంభాజీ పాత్రకు సరిపోయేలా కనిపించడానికి తాను 80- 105 కిలోలకు బరువు పెరిగినట్లు తెలిపారు. అంటే దాదాపు 25 కేజీల బరువు పెరిగారు. అలాగే గుర్రపు స్వారీ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారట. ఇంకా కట్టి కత్తియుద్ధం, ఈటెల పోరాటం వంటి యుద్ద సన్నివేశాల కోసం 6-7 నెలల పాటు సరైన శిక్షణ పొందినట్లు తెలిపారు. నెలలు తరబడి యాక్షన్ సీక్వెన్స్‌లను ప్రాక్టీస్ చేశారట. టీజర్‌లో చూపించిన యాక్షన్ సీక్వెన్స్ మొత్తం 500 మంది స్టంట్‌మెన్‌లతో సహా 2,000 మందితో మండే ఎండలో చిత్రీకరించినట్లు తెలిపారు. షూటింగ్ రంజాన్ సమయంలో జరిగింది. అప్పుడు చాలా మంది ఉపవాసం ఉన్నారు. అయినప్పటికీ శంభాజీ మహారాజ్ కీర్తిని తెరపై ప్రదర్శించడానికి సెట్ లో ఉన్నవాళ్ళంతా ఎంతో శ్రమించారు అంటూ 'ఛావా' సమయంలో తన అనుభవాలను పంచుకున్నారు విక్కీ.
Also Read: Tollywood Divorce: భర్తతో విడిపోతున్న మరో హీరోయిన్.. ఫొటోలు డిలీట్!
'ఛావా' ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పీరియాడికల్ డ్రామాలో అశుతోష్ రాణా, దివ్య దత్తా, నీల్ భూపాలం, సంతోష్ జువేకర్, ప్రదీప్ రావత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంటోంది.
Also Read: Kurchi Madathapetti: 'కుర్చీ మడతపెట్టి' పాటకు యమ క్రేజ్.. నేపాల్ వీధుల్లో దుమ్మురేపిన అమ్మాయిలు! వీడియో వైరల్