Mass Jathara Glimpse: రవితేజ ‘మాస్ జాతర’కు డేట్ ఫిక్స్.. ఇక రచ్చ రచ్చే!

రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తోన్న ‘మాస్ జాతర’ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ గ్లింప్స్‌ను జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఒక పోస్టర్ వదిలారు. అందులో రవితేజ మాస్ లుక్ ఊరమాస్‌గా ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

New Update
ravi teja, sreeleela Mass Jathara Movie Glimpse Release on january 26th

ravi teja, sreeleela Mass Jathara Movie Glimpse Release on january 26th

మాస్ మహారాజ రవితేజ ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. కానీ హిట్ కొట్టలేకపోతున్నాడు. ఎప్పుడో ధమాకాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు చేశారు. ఇవి బాక్సాఫీసు వద్ద విఫలమయ్యాయి. ఇప్పుడు మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. 

మాస్ జాతరతో రవితేజ

ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. దీంతో భాను బోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ అనే సినిమా చేస్తు్న్నాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రవితేజ కెరీర్‌లో 75వ సినిమాగా రాబోతుంది. 

Also Read :  ఆస్కార్‌కి ప్రియాంక చోప్రా ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ నామినేట్!

గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్

ఈ చిత్రంలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. తెలంగాణ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. 

Also Read :  నాలుగో రోజు కంటిన్యూ .. దిల్ రాజు ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు

Also Read :  భర్తతో విడిపోతున్న మరో హీరోయిన్.. ఫొటోలు డిలీట్!

రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. ఈ విషయాన్ని చెప్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో రవితేజ మాస్ లుక్ ఊరమాస్‌గా ఉంది. అది చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు