Funky Movie: కథ లేకుండా సింగిల్ లైన్ పంచ్ డైలాగ్స్ సరిపోతాయా? ‘ఫంకీ’పై నెటిజన్ల కామెంట్స్

విశ్వక్ సేన్ నటించిన కామెడీ సినిమా ‘ఫంకీ’ ఫిబ్రవరి 13న విడుదలకు సిద్ధమైంది. కథకంటే పంచ్ డైలాగ్స్‌పైనే ఆధారపడిన ఈ సినిమాకు భారీ హైప్ లేదు. ప్రమోషన్స్ తక్కువగా ఉండటంతో సినిమా రిజల్ట్ పూర్తిగా మౌత్ టాక్‌పైనే ఆధారపడి ఉంది.

New Update
Funky Movie

Funky Movie

Funky Movie: విశ్వక్ సేన్(Vishwak Sen), కాయదు లోహర్(Kayadhu Lohar) హీరోహీరోయిన్లుగా నటించిన కామెడీ సినిమా ‘ఫంకీ’ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాతో దర్శకుడు అనుదీప్ తిరిగి గట్టిగా నిలబడాలని చూస్తున్నారు. ఆయన చివరి సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ఈ ప్రాజెక్ట్ ఆయనకు చాలా కీలకం అయింది.

Also Read :  కిరణ్ అబ్బవరం భారీ ప్లాన్.. జీ స్టూడియోస్‌తో పాన్ ఇండియా యాక్షన్ ఎపిక్!

Funky Movie Release On Feb 13th 2026

‘ఫంకీ’ని మొదటి నుంచే ఒక సింగిల్ లైన్ కామెడీ ఎంటర్టైనర్‌గా మేకర్స్ పరిచయం చేస్తున్నారు. నిర్మాత నాగ వంశీ కూడా స్పష్టంగా చెప్పారు. ఈ సినిమాలో బలమైన కథ, భారీ ఎమోషన్స్ ఆశించొద్దని, కేవలం టైమ్ పాస్ ఎంటర్టైన్మెంట్ కోసమే ఈ సినిమా అని తెలిపారు.

ఈ తరహా సినిమాలు పూర్తిగా పంచ్ డైలాగ్స్, సిట్యుయేషన్ కామెడీ మీదే ఆధారపడతాయి. అందుకే కొంతమందిలో సందేహాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు కనీసం ఒక హిట్ పాటైనా ఉండాలి అనే అభిప్రాయం ఉంది. కానీ ‘ఫంకీ’లో అలాంటి చార్ట్‌బస్టర్ సాంగ్ లేకపోవడం ఒక మైనస్‌గా కనిపిస్తోంది.

ట్రైలర్ మాత్రం ఓ మోస్తరు బజ్ తెచ్చింది. అయితే ప్రమోషన్స్ చాలా తక్కువగా ఉండటంతో, విడుదల రోజున థియేటర్లకు ప్రేక్షకులు ఎలా వస్తారు అనే దానిపై ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మొత్తానికి, ‘ఫంకీ’ విజయం పూర్తిగా ప్రేక్షకుల టాక్ మీదే ఆధారపడి ఉంటుంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వస్తేనే సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడే అవకాశం ఉంది. అనుదీప్ స్టైల్ సింగిల్ లైన్ కామెడీ ఈసారి క్లిక్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. - Tollywood news updates

Also Read :  కిస్‌ కిస్‌ కిస్‌ కిస్సిక్‌.. కేక పెట్టిస్తున్న కుషిత కల్లపు లేటెస్ట్ ఫొటోస్!

Advertisment
తాజా కథనాలు