/rtv/media/media_files/2025/07/20/hari-hara-veera-mallu-making-video-2025-07-20-09-32-34.jpg)
Hari Hara Veera Mallu Making Video
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా మేకింగ్ వీడియోను విడుదల చేసి సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశారు.
Also Read: డైనోసార్ అస్థిపంజరానికి వేలంలో రూ.260 కోట్లు
Hari Hara Veera Mallu Making Video
ఈ మేకింగ్ వీడియోలో సినిమా కోసం నిర్మించిన భారీ సెట్టింగ్‌లు, ముఖ్యంగా చరిత్ర ఆధారిత కోటలు, దర్బార్లు, చార్మినార్ వంటి నిర్మాణాలు ఎలా రూపొందించారో చూపించారు. ఆర్ట్ డైరెక్టర్ తోటా తరణి కృషిని ఇది స్పష్టం చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని మేకింగ్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఫైట్ రిహార్సల్స్ చేయడం, మార్షల్ ఆర్ట్స్‌ను ప్రత్యేకంగా నేర్చుకోవడం వంటివి హైలైట్‌గా నిలిచాయి.
Also read: 'ఉరిశిక్ష రద్దు.. నిమిష ప్రియ విడుదల!'
Also Read : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్
గతంలో ఏ సినిమా కోసం ఇంతగా కష్టపడలేదని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ మేకింగ్ వీడియో సినిమా భారీ స్కేల్‌ను, విజువల్ గ్రాండియర్‌ను సూచిస్తుంది. గ్రాఫిక్స్‌కు కూడా ఈ సినిమాలో అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణతో పాటు సినిమా టీం పడ్డ కష్టం, బిహైండ్ ది సీన్స్ ఫుటేజ్ ఇందులో ఉన్నాయి. ఈ మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వీడియోను చూసి సినిమా కోసం మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
Also Read : ఇజ్రాయెల్, సిరియా మధ్య కాల్పుల విరమణ
ప్రీ-రిలీజ్ ఈవెంట్:
ఈ నెల 21వ తేదీన (సోమవారం) హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు, మంత్రులు హాజరుకానున్నారు. మొత్తంగా తొలి భాగం జూలై 24న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.