Samsung Galaxy F36 5G: AI ఫీచర్లతో శామ్‌సంగ్ కొత్త ఫోన్ అదిరింది.. ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ

Samsung Galaxy F36 5G భారతదేశంలో విడుదలైంది. దీని 6/128GB ధర రూ.17,499, 8/256GB ధర రూ.18,999గా ఉంది. ఈ సేల్ జూలై 29న ప్రారంభమవుతుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ICICI, SBI, HDFC, Axis బ్యాంక్ కార్డులపై రూ.1,000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందొచ్చు.

New Update
Samsung Galaxy F36 5G

Samsung Galaxy F36 5G

శామ్సంగ్ తన తాజా 5G స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy F36 5Gని భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్ 6.7-అంగుళాల FHD + సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ + ప్రొటెక్షన్, అధిక బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీనితో పాటు ఫోన్‌లో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా (OISతో), 5000mAh బ్యాటరీ, Exynos 1380 కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ప్లాట్‌ఫామ్‌పై నడుస్తుంది. 

Also Read: డైనోసార్‌ అస్థిపంజరానికి వేలంలో రూ.260 కోట్లు

Samsung Galaxy F36 5G Price

Samsung Galaxy F36 5G రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499గా ఉంది. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ మొబైల్ రెండు కలర్ ఆప్షన్లలో వచ్చింది. ఈ సేల్ జూలై 29న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ICICI, SBI, HDFC, Axis బ్యాంక్ కార్డులపై రూ.1,000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందొచ్చు. 

Also read: 'ఉరిశిక్ష రద్దు.. నిమిష ప్రియ విడుదల!'

Samsung Galaxy F36 5G Specifications

Samsung Galaxy F36 5G ఫోన్ 6.7-అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Samsung Exynos 1380 (5nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్, 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంది. ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా ఉంది. రెండు కెమెరా సెటప్‌లు 4K వీడియో షూటింగ్‌కు మద్దతు ఇస్తాయి.

Also Read : ఇజ్రాయెల్, సిరియా మధ్య కాల్పుల విరమణ

అంతేకాకుండా AI ఎడిటింగ్, ఫోటో రీమాస్టర్, సర్కిల్ టు సెర్చ్, ఆబ్జెక్ట్ ఎరేజర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. Samsung Galaxy F36 5G Android 15, One UI 7 పై నడుస్తుంది. Galaxy F36 5G మొబైల్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. 

Also Read : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్

samsung-galaxy | tech-news-telugu | telugu tech news | tech-news

Advertisment
Advertisment
తాజా కథనాలు