Vijay Devarakonda: నేనలా అనలేదు.. వివాదంపై విజయ్‌ దేవరకొండ క్లారిటీ!..

రెట్రో ప్రీ రిలీజ్‌లో ట్రైబల్స్‌పై చేసిన వ్యాఖ్యలపై విజయ్‌ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. ‘‘ఏ వర్గాన్నీ, ఏ తెగనూ బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. వారందరూ నా కుటుంబ సభ్యులే అని అనుకుంటాను. నా వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే విచారం వ్యక్తం చేస్తున్నాను’’ అని తెలిపాడు.

New Update
vijay devara konda

vijay devara konda

సూర్య హీరోగా తెరకెక్కిన రెట్రో మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా వెళ్లిన విజయ్ దేవరకొండ మాట్లాడిన కామెంట్స్ వివాదాస్పందంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వివాదంపై నటుడు విజయ్ దేవరకొండ స్పందించాడు.  రెట్రో ఆడియో లాంచ్ కార్యక్రమంలో తాను చేసిన ఒక వ్యాఖ్యలు కొంతమంది ప్రజలలో ఆందోళన కలిగించిందని.. అది తన దృష్టికి వచ్చింది అని అన్నాడు. 

Also Read: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!

వారిని బాధపెట్టడం నా ఉద్దేశం కాదు

ఇప్పుడు ఆ విషయాన్ని తాను హృదయపూర్వకంగా స్పష్టం చేయాలనుకుంటున్నానని తెలిపాడు. ఏ సమాజాన్ని, ముఖ్యంగా మన షెడ్యూల్డ్ తెగలను బాధపెట్టడం తన ఉద్దేశ్యం కాదని అన్నాడు. తాను వారిని ఎంతో గౌరవిస్తాను అని తెలిపాడు. మన దేశ ఐక్యత, మనం ఎలా ముందుకు సాగాలి అనే విషయం గురించి మాత్రమే మాట్లాడానని.. ట్రైబల్ అనే పదాన్ని వేరే సెన్స్‌లో యూజ్ చేసానని పేర్కొన్నాడు.

Also Read: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

తన వల్ల.. తన సందేశంలోని ఏదైనా అంశం తప్పుగా అర్థం చేసుకోబడినా లేదా బాధ కలిగించేలా ఉన్నా.. దానికి తాను హృదయపూర్వక విచారం వ్యక్తం చేస్తున్నాను అని తెలిపాడు. శాంతి, అభివృద్ధి, ఐక్యత గురించి మాత్రమే తాను మాట్లాడానని పేర్కొన్నాడు. వేరు చేయాలనేది ఎప్పటికీ తన ఉద్దేశం కాదని అన్నాడు. కేవలం ఐకమత్యం కోసమే తాను మాట్లాడానని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఇప్పటికైనా ఈ వివాదానికి చెక్ పడుతుందో లేదో చూడాలి. 

Also Read: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

ఏం జరిగిందంటే?

సూర్య హీరోగా తెరకెక్కిన రెట్రో మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా వెళ్లిన విజయ్  సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో ఆదివాసులపై అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారంటూ లాయర్ కిషన్ చౌహాన్‌.. హీరో విజయ్ దేవరకొండపై ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చౌహాన్‌ ఫిర్యాదు మేరకు విజయ్ పై కేసు నమోదైంది. 

Also Read: రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్‎లో టెన్షన్ టెన్షన్..!

ఉగ్రవాదుల గురించి మాట్లాడబోయి

హీరో విజయ్ రెట్రో ఈవెంట్ లో  పాకిస్తాన్ ఉగ్రవాదుల గురించి మాట్లాడబోయి గిరిజనులు అంటూ కీలక కామెంట్స్ చేశాడు. 500 ఏళ్ల క్రితం గిరిజనులు ఘర్షణ పడినట్లుగా కశ్మీర్‌లో టెర్రరిస్టులు  దాడులు, విధ్వంసం సృష్టిస్తూ ఇప్పటికీ అలా కామన్ సెన్స్ లేకుండా, బుద్ధి లేకుండా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారంటూ కామెంట్స్ చేశాడు. దీంతో అప్పటినుంచి విజయ్ దేవరకొండ క్షమాపణలు చెప్పాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. 

latest-telugu-news | vijay-devarakonda-new-movie | Retro Promotions | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news

Advertisment
Advertisment
Advertisment