OG Vs Coolie.. ఇవాళ యూట్యూబ్ షేక్ అవ్వాల్సిందే..!

ఈరోజు రజినీకాంత్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పండగే. ఎందుకంటే సాయంత్రం 7 గంటలకు రజినీకాంత్ ‘కూలీ’ ట్రైలర్, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ఫస్ట్ సాంగ్ విడుదల కానున్నాయి. కాగా కూలీ ఆగస్ట్ 14న, OG సెప్టెంబర్ 25న విడుదల కానున్నాయి.

New Update
OG VS Coolie

OG VS Coolie

OG VS Coolie: రజినీకాంత్(Rajinikanth), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ కి ఈరోజు పండగే.. రజినీకాంత్ 'కూలీ' ట్రైలర్(Coolie Trailer), పవన్ కళ్యాణ్ OG ఫస్ట్ సాంగ్(OG First Single) రెండూ ఈరోజు యూట్యూబ్ లో విడుదల కానున్నాయి. సాంగ్ అండ్ ట్రైలర్ విడుదలకు సాయంత్రం 7pm కు టైమ్ కూడా  ఫిక్స్ చేశారు మేకర్స్. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ ‘కూలీ’ పై రోజు రోజుకు క్రేజ్ పెరుగుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీ, సమయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో సందడి మొదలైంది.

Also Read: 'A' ‌రేటింగ్‌తో కు..కు..కు.. కూలీ పవర్ హౌసే... ఆగస్ట్ 14 అస్సలు తగ్గేదేలే!

ట్రైలర్ రిలీజ్ డేట్ & టైమ్.. 

చిత్ర నిర్మాతలు సన్ పిక్చర్స్ శనివారం తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేస్తూ, ట్రైలర్ ఆగస్ట్ 2, 2025న సాయంత్రం 7 గంటలకు విడుదల అవుతుందని తెలిపారు. ఇదే రోజు చెన్నైలో జరిగే గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్‌కు ముందుగా ట్రైలర్ విడుదల కానుంది. ఈ విషయాన్నీ మూవీ టీమ్ "#Coolie varraan solliko! The day is here! #CoolieTrailer from today 7 PM " అనే క్యాప్షన్‌తో ట్విట్టర్(X) లో  చేసిన పోస్టు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

ఈ సినిమాలో రజినీకాంత్‌ తో పాటు అన్ని ఇండస్ట్రీస్ కి చెందిన ప్రముఖ నటులు కనిపించనున్నారు. నాగార్జున అక్కినేని, పూజా హెగ్డే, శ్రుతి హాసన్, ఉపేంద్ర, కిషోర్ కుమార్, రేబా మోనికా జాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, కాళీ వెంకట్, మహేంద్రన్, అయ్యప్ప పి శర్మ, మోనిషా బ్లెస్సీ వంటి ప్రముఖులు నటిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

ఈ యాక్షన్ డ్రామాలో రజినీకాంత్ "దేవా" అనే పాత్రలో కనిపించనున్నాడు. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథే ఈ చిత్రం. ఈ సినిమాని కలానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

అనిరుధ్ రవిచందర్ పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. అనిరుధ్ ‘జైలర్’ మూవీకి కూడా మ్యూజిక్ అందించారు, అది కూడా సూపర్ హిట్టే. ఇక కూలీ సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చినట్టు అధికారిక సమాచారం వచ్చింది. 

ఈ భారీ చిత్రం ఆగస్ట్ 14, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఇదే రోజు బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 'వార్ 2' చిత్రం కూడా థియేటర్లలోకి వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీ జరగనుంది.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ పై కూడా హైప్ మాములుగా లేదు. ఈ సినిమాను సుజీత్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. అయితే ఈ మూవీ సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీర అనే పాత్రలో కనిపించనున్నారు. రివెంజ్, ఎమోషన్స్, యాక్షన్ డ్రామాతో ఈ మూవీ రూపొందుతోంది. ఈ రోల్ కోసం పవన్ ప్రత్యేకమైన లుక్ ట్రై చేస్తున్నారు. 

Also Read: పవర్ స్టార్ 'ఫైర్ స్ట్రామ్'.. OG ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోందోచ్!

ఫస్ట్ లిరికల్ సాంగ్..

 సినిమా విడుదల టైం దగ్గర పడుతుండటంతో, మూవీ టీమ్ ప్రమోషన్‌లు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆగస్ట్ 2న ఈ రోజు తొలి లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఈ పాటకు ఎస్. థమన్ సంగీతం అందించగా, అభిమానుల అంచనాలకు తగ్గట్టే ఎనర్జిటిక్ బీట్స్‌తో ఇప్పటికే విడుదల చేసిన ప్రోమో దుమ్ము దులుపుతుంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ‘ఓజీ’ టీమ్ ప్రమోషన్‌ల మీద దృష్టిపెట్టింది. పవన్ రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా, ఈ చిత్ర ప్రమోషన్ కోసం సమయం కేటాయించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నై, హైదరాబాద్, ముంబయి వంటి నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ జరిపే ప్లాన్‌లో ఉన్నారు.

క్యామియోలో అకీరా నందన్?

ఇంకొక ఆసక్తికర అంశం ఏమిటంటే, పవన్ కుమారుడు అకీరా నందన్ ఈ సినిమాలో చిన్న క్యామియో రోల్‌లో కనిపించనున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఈ వార్త సినిమాపై అంచనాలు మరింత పెంచుతోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఎమ్రాన్ హష్మీ, టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక మోహన్, అలాగే అర్జున్ దాస్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరి పాత్రలు కథలో కీలకంగా ఉంటాయని తెలుస్తోంది.

మొత్తానికి, 'ఓజీ' చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో విడుదల కాబోతోంది. పవన్ కళ్యాణ్ మాస్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తిరగరాయడం ఖాయమనే నమ్మకంతో మూవీ టీమ్ ఉంది.

మరి ఈరోజు సాయంత్రం విడుదల కానున్న కూలీ ట్రైలర్, OG సాంగ్  ఎన్ని రికార్డులు కొల్లగొడతాయి చూడాలి..

Advertisment
తాజా కథనాలు