Samantha: సమంత ఎంగేజ్మెంట్..? రింగుతో ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!

టాలీవుడ్ నటి సమంతకి సంబంధించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

New Update
samantha photo with ring goes viral

samantha photo with ring goes viral

Samantha: టాలీవుడ్ నటి సమంతకి సంబంధించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ ఫొటోలో సామ్ తన చేతికున్న ఉంగరాన్ని చూపిస్తూ ఫొటోకు ఫోజిచ్చింది. ఇది కాస్త నెట్టింట రకరకాల ఊహాగానాలకు తెరలేపింది. ఈపిక్ చూసిన వారంతా  సమంత నిశ్చితార్థం చేసుకుందా? అని కామెంట్లు పెడుతున్నారు. అయితే గత కొద్దిరోజులుగా సమంత..డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు  చేస్తున్నాయి. అంతేకాదు పలు ఈవెంట్లకు, సినిమా ఫంక్షన్లకు, వెకేషన్లకు  వీరిద్దరూ కలిసి వెళ్లడం ఈ రూమర్లకు  మరింత ఆజ్యం పోసింది. ఈ క్రమంలో సామ్ చేతికి రింగ్ పెట్టుకొని  ఉన్న ఫొటోను షేర్ చేయడం ఎంగేజ్మెంట్ రూమర్లకు దారితీసింది. దీంతో వీరిద్దరూ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారా? త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

డేటింగ్ రూమర్స్ 

ఇదిలా ఉంటే రాజ్ నిడిమోరు దర్శకత్వంలో సామ్ 'ఫ్యామిలీ' సీరీస్ చేసింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సీరీస్ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత సిటాడెల్: హానీ బన్నీ సీరీస్ కూడా చేశారు. ఈ ప్రాజెక్ట్స్ చేస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్ల పై ఇటు సమంత, అటు రాజ్ నిడిమోరు ఇప్పటివరకు ఏ విధంగా స్పందించలేదు. ఇటీవలే వీరిద్దరూ కలిసి ఓ వెకేషన్ వెళ్లిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మరోవైపు సామ్ సన్నిహిత వర్గాలు మాత్రం.. వాళ్లిద్దరూ కేవలం స్నేహితులేనని చెబుతున్నారు. 

ఇక సామ్ సినిమాల విషయానికి వస్తే.. అనారోగ్య సమస్యలతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సామ్.. ప్రొడక్షన్ రంగంలో అడుపెట్టింది. తన సొంత  ప్రొడక్షన్ కంపెనీ  'ట్రాలాలా'  బ్యానర్ ఫై మొదటి సినిమా 'శుభం' నిర్మించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో నటించిన వారంతా కొత్త టాలెంట్ కావడం విశేషం.  'ట్రాలాలా' బ్యానర్ ఉద్దేశం కూడా కొత్త టాలెంట్, న్యూ ఐడియాస్ ని ఎంకరేజ్ చేయడమని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పింది సామ్. ప్రస్తుతం సామ్ తన సొంత ప్రొడక్షన్ లో 'మా ఇంటి బంగారం', రంగమార్తాండ సినిమాలు చేస్తోంది. త్వరలోనే వీటికి సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి.  ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది సామ్. ఫిట్ నెస్, హెల్త్ కి సంబంధించిన విషయాలపై అవగాహన కల్పిస్తుంటుంది.  ఇటీవలే ఫిట్ నెస్ గురించి సామ్ షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. 

Also Read:71st National Film Awards 2025: డైరెక్టర్ సుకుమార్ కూతురి సత్తా.. తొలి సినిమాతో నేషనల్ అవార్డు

Advertisment
తాజా కథనాలు