KINGDOM: గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ 'కింగ్ డమ్'. లైగర్, ఫ్యామిలీ స్టార్ ప్లాప్స్ తర్వాత విజయ్ నుంచి రాబోతున్న ఈ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ ఎప్పుడెప్పడా అని ఆసక్తిగా ఎదురుచొస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కి షాకిచ్చారు మేకర్స్.
#Kingdom
— Vijay Deverakonda (@TheDeverakonda) May 14, 2025
July 04, 2025.
Will see you in the cinemas :) pic.twitter.com/uQUjpngygD
Also Read : వేసవిలో చల్లదనాన్ని పంచే మామిడి ఫలూదా.. దీనిని సింపుల్‌గా ఇలా చేసుకోండి
కింగ్ డమ్ వాయిదా
కింగ్ విడుదల వాయిదా వేస్తూ.. కొత్త డేట్ అనౌన్స్ చేశారు. మే 30న రిలీజ్ చేయాలని అనుకున్న ఈ చిత్రాన్ని జులై 4 కి పోస్ట్ పోన్ చేశారు. పాక్- భారత్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ ట్వీట్ చేశారు మేకర్స్. ''మా 'కింగ్‌డమ్' సినిమా విడుదలను మే 30న ప్రారంభించాలని నిర్ణయించగా, జూలై 4కి వాయిదా వేయాల్సి వచ్చింది. అసలు తేదీనే విడుదల చేయడానికి చాలా ప్రయత్నించాము. కానీ దేశంలో ఇటీవల జరిగిన ఊహించని సంఘటనలు, ప్రస్తుత వాతావరణం సినిమా ప్రమోషన్లు లేదా వేడుకలతో ముందుకు సాగడం కష్టతరం చేశాయి.. అందువల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్లు పోస్ట్ లో పేర్కొన్నారు.
ALSO READ: Single Movie Collections: ఈ రేంజ్ కలెక్షన్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా! #సింగిల్ వరల్డ్ వైడ్ ఎంతంటే..?
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా.. సత్యదేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. యంగ్ టాలెంట్ అనిరుద్ రవిచందర్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ హృదయం విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
latest-news | telugu-news | cinema-news | telugu-cinema-news | Vijay Devarakonda
ALSO READ: Anand Devarakonda: గ్రీన్ టీ షర్ట్.. కిల్లింగ్ స్టైల్‌లో ఆనంద్.. లుక్స్‌కి అమ్మాయిలు ఫిదా!
Also Read : పాలు తాగుతూ నిద్రపోయే చిన్నారుల వెనుక ఉన్న కారణం ఇదే