Coolie Trailer: రజినీ కాంత్ రచ్చ రచ్చ.. 'కూలీ' ట్రైలర్ వచ్చేసింది!

భారీ అంచనాలతో తెరకెక్కిన  సూపర్ స్టార్ రజినీకాంత్ 'కూలీ' ట్రైలర్ విడుదలైంది. లోకేష్ కనగరాజ్ యాక్షన్ మార్క్, అదిరిపోయే విజువల్స్, బీజీఎమ్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

New Update

Coolie Trailer: భారీ అంచనాలతో తెరకెక్కిన  సూపర్ స్టార్ రజినీకాంత్ 'కూలీ' ట్రైలర్ విడుదలైంది. లోకేష్ కనగరాజ్ యాక్షన్ మార్క్, అదిరిపోయే విజువల్స్, బీజీఎమ్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఎప్పటిలాగే  రజినీకాంత్ స్క్రీన్ ప్రజెన్స్, స్వాగ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. యాక్షన్ సీక్వెన్సుల్లో అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే ట్రైలర్ లో నాగార్జున ఎంట్రీ, ఆయనకు సంబంధించిన సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. 

గోల్డ్ స్మగిలింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. 'జైలర్ ' తర్వాత లోకేష్ కనగరాజ్- రజినీ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ , ఇతర ప్రమోషనల్ కంటెంట్ సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. అనిరుద్ మ్యూజిక్ సినిమాకు మరో హైలైట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా మోనికా , కు..కు..కూలీ పవర్ హౌస్ సాంగ్స్ మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను సన్ పీక్చర్స్ బ్యానర్ పై కళాయనిది మారన్ నిర్మించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ రజినీ 'దేవా' పాత్రలో కనిపించబోతున్నారు. స్టార్ స్టడెడ్ గా రాబోతున్న ఈ చిత్రంలో నాగార్జున , ఉపేంద్ర, శృతి హాసన్, రెబా మోనికా, సౌబిన్ షాహిర్, సత్యరాజ్ , కిషోర్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఇందులో నాగార్జున పాత్ర గతంలో ఎప్పుడూ చేయని విధంగా డిఫరెంట్ గా ఉండబోతుంది. 

పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ట్రైలర్ విడుదల చేశారు.

ఇదిలా ఉంటే.. రజినీ కూలీ,ntr వార్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్దమవుతున్నాయి. వార్ 2 కూడా ఆగస్టు 14న విడుదల కానుండి. హై యాక్షన్ డ్రామాగా రాబోతున్న వార్ 2 బజ్ కూడా మామూలుగా లేదు. అయాన్ ముఖార్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హృతిక్- ntr కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు. 

Also Read: Anasuya: అబ్బా! అనసూయ చీరలో ఎంత అందంగా ఉందో.. ఒక్కసారి ఫొటోలపై లుక్కేయండి

Advertisment
తాజా కథనాలు