/rtv/media/media_files/2026/03/06/tvk-president-vijay-2026-03-06-08-49-34.jpg)
తమిళనాట(tamilnadu) రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న నటుడు విజయ్(TVK President Vijay), ఇప్పుడు తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిచారు. నిర్మాత కల్పతి ఎస్.సురేష్ కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్‌కు విజయ్, త్రిష ఒకే కారులో రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ వేడుకకు కోలీవుడ్ ప్రముఖులంతా హాజరైనప్పటికీ, అందరి కళ్లు మాత్రం ఈ జంటపైనే నిలిచాయి. గత కొంతకాలంగా విజయ్ తన భార్య సంగీతకు దూరంగా ఉంటున్నారని, ఒక నటితో సహజీవనం చేస్తున్నారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల ఒక బీజేపీ నేత విజయ్ వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే, తాజాగా విజయ్ భార్య సంగీత స్వయంగా కోర్టును ఆశ్రయించడం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది.
Also Read : ఇండియాకు అమెరికా గుడ్‌న్యూస్.. 30 రోజులు అవకాశం
Vijay Attended Wedding With Trisha
ஒரே காரில் ஒன்றாக வந்திறங்கிய தவெக தலைவர் விஜய், திரிஷா!#Vijay#Trisha#Marriagefunction#Viralvideo#TVKvijay#Newstamil24x7pic.twitter.com/u8miibYs5R
— News Tamil 24x7 (@NewsTamilTV24x7) March 5, 2026
సంగీత తన ఫిర్యాదులో.. తన భర్త ఒక నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని, అందుకే తాను 2025 డిసెంబర్లోనే విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు చెంగల్పట్టు జిల్లా ఫ్యామిలీ కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఏప్రిల్ 20న ఈ కేసు తదుపరి విచారణ జరగనుంది. ఇలాంటి ఉత్కంఠభరిత పరిస్థితుల్లో విజయ్-త్రిష కలిసి బహిరంగంగా కనిపించడం విశేషం.
విజయ్, త్రిష(vijay trisha viral video) జోడీకి వెండితెరపై మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరు ఘిల్లి, తిరుపాచి వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించగా, ఇటీవల లియో చిత్రంతో మళ్ళీ జంటగా అలరించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఏకంగా ఒకే కారులో పెళ్లికి హాజరుకావడంతో, వీరిద్దరి బంధంపై వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయింది.
రాజకీయాలపై ప్రభావం చూపేనా?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విజయ్ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. అధికారమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. అయితే, ఒకవైపు భార్య చేసిన ఆరోపణలు, మరోవైపు త్రిషతో కలిసి తిరుగుతున్నారనే వార్తలు ఆయన రాజకీయ ఇమేజ్ను దెబ్బతీస్తాయా? లేక ప్రజలు దీన్ని కేవలం వ్యక్తిగత విషయంగానే చూస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్(actor-vijay)-త్రిషకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు కొందరు వీరి జోడీని సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం సంగీత ఆరోపణల నేపథ్యంలో విజయ్ తీరును తప్పుబడుతున్నారు.
Also Read : ఇండియాలో కుప్పకూలిన కోడి గుడ్డు ధర.. రోజుకు రూ. 5 కోట్ల నష్టం!
Follow Us