/rtv/media/media_files/2026/03/06/russian-oil-2026-03-06-08-11-11.jpg)
ఇండియా - అమెరికా ట్రేడ్ డీల్(america trade deal with india) ఒప్పందంలో అగ్రరాజ్యం భారత్‌కు 30 రోజులు ఊరట నిచ్చింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ఏర్పడిన ఒత్తిడిని తగ్గించేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రంలో నిలిచిపోయిన రష్యా ముడి చమురు నౌకలను కొనుగోలు చేసేందుకు భారతీయ రిఫైనరీలకు 30 రోజుల తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా ట్రెజరీ విభాగం ప్రకటించింది. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ సంస్థలు ఈ తాత్కాలిక గడువును ఉపయోగించుకుని రష్యా నుంచి చమురు దిగుమతులను వేగవంతం చేసే పనిలో ఉన్నాయి. - India America Relations
అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు ఆటంకం కలగొద్దనేదే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యం. నెల రోజుల క్రితం భారత్, అమెరికాతో వాణిజ్యం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఒప్పందంలో భాగంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించి.. అమెరికా నుంచి ఇందనాన్ని కొనాలి. ఈక్రమంలో సముద్రం మధ్యలో చిక్కుకుపోయిన రష్యా చమురు రవాణా నౌకల లావాదేవీలకు మాత్రమే ఈ 30 రోజుల గడువు వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. "ప్రపంచ మార్కెట్లో చమురు సరఫరా నిరంతరాయంగా సాగాలి. అందుకే భారత రిఫైనరీలకు ఈ తాత్కాలిక మినహాయింపు ఇచ్చాం. ఇది రష్యా ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చదు, కేవలం నిలిచిపోయిన నౌకలకే పరిమితం," అని బెస్సెంట్ పేర్కొన్నారు. - Trump assures India of Russia oil purchase
BIG BREAKING: US ISSUES 30-DAY WAIVER ALLOWING INDIA TO CONTINUE BUYING RUSSIAN OIL - Scott Bessent, "... To enable oil to keep flowing into the global market, the Treasury Department is issuing a temporary 30-day waiver to allow Indian refiners to purchase Russian oil... India… pic.twitter.com/jSLx6Fy7z1
— Griha Atul (@GrihaAtul) March 6, 2026
Also Read : ఇజ్రాయిల్‌పై ఇరాన్ డేంజరస్ క్లస్టర్ బాంబ్.. బయటపడ్డ చైనా, రష్యా సీక్రెట్ ఆపరేషన్!
భారత్ ఎందుకు మొగ్గు చూపుతోంది?
భారత్ తన చమురు అవసరాల్లో సుమారు 40 శాతం మధ్యప్రాచ్యం నుండే దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా ఈ రవాణా సాగుతుంది. ప్రస్తుత యుద్ధ వాతావరణంతో అక్కడ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీంతో భారత్ తన ఇంధన భద్రత కోసం రష్యా వైపు చూస్తోంది. భారత వద్ద ప్రస్తుతం కేవలం 25 రోజులకు సరిపడా చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. - russia oil exports
Also Read : పాక్ ఎంబసీలు వదిలేయండి.. అమెరికా అప్రమత్తం
ఇండియా - అమెరికా ట్రేడ్ డీల్
గతంలో రష్యా నుండి చమురు కొనుగోలు చేసినందుకు భారత్‌పై అమెరికా(Trump Russia oil deal on India) 25 శాతం వరకు టారిఫ్‌లు విధించే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే, ఇటీవల అమెరికా-భారత్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్, ప్రస్తుత భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అమెరికా ఈ వెసులుబాటు కల్పించింది. భవిష్యత్తులో భారత్ అమెరికా నుండి ఎక్కువ చమురు కొనుగోలు చేస్తుందని తాము ఆశిస్తున్నట్లు వాషింగ్టన్ వెల్లడించింది.
Follow Us