అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో అనిల్ ఇనుమడుగు(Anil Inamadugu) హీరోగా వేణి రావ్(Veni Rao) హీరోయిన్‌గా తెరకెక్కిన ' ఏమి మాయ ప్రేమలోన' మ్యూజిక్ ఆల్బంకు మంచి ఆదరణ లభిస్తోంది. లీడ్ రోల్‌లో నటించిన అనిల్ ఇనుమడుగు ఈ పాటకు లిరిక్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. మార్క్ ప్రశాంత్ సంగీతం అందించిన 'ఏమి మాయ ప్రేమలోన'(Yemi Maya Premalona) సాంగ్‌ను దిన్కర్ కలవుల, దివ్య ఐశ్వర్య ఆలపించారు. అయితే ఈ పాట లిరిక్స్ అయితే అదిరిపోయాయి. ఈ లిరిక్స్ విన్న ప్రేక్షకులు బాగుందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
🎶 Yemi Maya Premalona - Full Song OUT NOW! ❤️✨
— Mango Music (@MangoMusicLabel) October 3, 2025
A vintage melody for today’s hearts 💫
👉 Watch here: https://t.co/gINTCUk8mR@anilinamadugu @_veni_rao @mark_prashu @sravan_filmmaker @akicreativework#AjayKumar @dedphysce
With ❤️ @pavan_kumar_1999 @_Iam_alif @abel_arikkatt… pic.twitter.com/ZP2BHqKx3i
Also Read : ‘ఓజీ’ ప్రీక్వెల్‌లో అకీరా?.. డైరెక్టర్ సుజీత్ ఫుల్ క్లారిటీ
టూరిస్ట్ గైడ్‌గా ఉండే..
కేరళలో టూరిస్ట్ గైడ్‌గా ఉండే ఓ అనాథ కుర్రాడి జీవితంలో ఓ మేఘాలు కమ్ముకున్న రోజు ఓ అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఈ మేఘాల మధ్యన దాగిన మెరుపులా ఆ కుర్రాడికి తారాసపడిన ఆ అమ్మాయి ప్రేమని గెలుచుకునే ఓ సున్నితమైన కథాంశం నేపధ్యంలో తెరకెక్కింది. ఏమి మాయ ప్రేమాలోన సాంగ్ దసరా కానుకగా యూట్యూబ్ లో రిలీజ్ అయి భారీ వ్యూస్ రాబడుతోంది. నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. కాన్సెప్ట్‌తో పాటు డైరెక్షన్ కూడా బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సూపర్బ్‌గా ఉందని చెప్పాలి. కేరళలోని లొకేషన్స్‌ను చూడముచ్చటగా సినిమాటోగ్రాఫర్ శ్రవణ్ చూపించాడు. ప్రతీ ఫ్రేమ్‌ను కూడా రిచ్‌గా చూపించాడు. లీడ్ రోల్స్ చేసిన అనిల్, వేణి రావ్ జోడి బాగుంది. స్క్రీన్ మీదా ఇద్దరు సహజంగా నటించారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పది నిమిషాల నిడివి కలిగిన ఏమి మాయ ప్రేమలోన సాంగ్‌ను అకి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో యంగ్ నిర్మాతలు అజయ్, విష్ణు నిర్మించారు. ఇప్పటి వరకు మీరు ఈ సాంగ్ చూడకపోతే ఓసారి చూసేయండి.
Yemi Maya Premalona
— சினிமாக்குத்தூசி (@mayirepochu1) October 2, 2025
– A Soulful Vintage Melody
From
Love ..!!
♥️ pic.twitter.com/VvQYoTA6de
Also Read : సుహాస్ సినిమా షూటింగ్ లో ప్రమాదం.. సముద్రంలో మునిగిపోయిన పడవ