/rtv/media/media_files/2025/10/05/sujeeth-about-og-prequel-and-sequel-2025-10-05-18-57-54.jpg)
sujeeth about og prequel and sequel
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుజీత్ కాంబోలో వచ్చిన ‘ఓజీ’ ఎంతటి రెస్పాన్స్ అందుకుందో అందరికీ తెలిసింది. సెప్టెంబర్ 25న రిలీజ్ అయిన ఈ చిత్రం అభిమానులకు ఫుల్ మీల్స్ అందించింది. ఒక హీరోపై అభిమానం ఉన్న ప్రేక్షకుడు.. అతడితో కలిసి సినిమా తీస్తే ఎలా ఉంటుందో సుజీత్ చూపించాడు. ఇందులో పవన్ స్టైల్, లుక్, ఎలివేషన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. అంతేకాకుండా ఈ చిత్రానికి థమన్ అందించిన సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.
og prequel and sequel
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌తో చిత్రబృందం ఫుల్ హ్యాపీగా ఉంది. ఇటీవలే సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి సందడి చేసింది. ఇక విదేశాల్లో సైతం ఈ ‘OG’ చిత్రానికి విశేష స్పందన లభించింది. ఇందులో భాగంగానే ఫుల్ హ్యాపీలో ఉన్న డైరెక్టర్ సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తాజాగా డాలస్ వెళ్లారు. అక్కడ వీరిద్దరూ ఓ థియేటర్‌లో ‘ఓజీ’ సినిమా చూశారు. ప్రేక్షకులతో కలిసి ఎంజాయ్ చేశారు. అనంతరం షో పూర్తయ్యాక థియేటర్‌లోనే కేక్ కట్ చేసి.. సెలబ్రేట్ చేసుకున్నారు.
In the words of our Director @SujeethSign ❤️#OG#TheyCallHimOGpic.twitter.com/B7qaCGtQk2
— DVV Entertainment (@DVVMovies) October 5, 2025
ఆపై అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు డైరెక్టర్ సుజీత్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఈ మేరకు ఓజీ మూవీ ప్రీక్వెల్, సీక్వెల్‌పై మాట్లాడారు. ఓ అభిమాని మాట్లాడుతూ.. ‘ఓజీ’ చిత్రానికి సీక్వెల్ వస్తుందా? లేకా ప్రీక్వెల్ వస్తుందా? అని అడగ్గా.. రెండూ వస్తాయని సుజీత్ తెలిపారు. మరొక అభిమాని మాట్లాడుతూ.. ‘ఓజీ’ ప్రీక్వెల్‌లో పవన్ కుమారుడు అకీరా నందన్ ఉంటారా? అని అడగ్గా.. దాని గురించి ఇప్పుడే చెబితే థ్రిల్ ఉండదని.. అందరికీ మరో టైంలో సర్‌ప్రైజ్ అందిస్తానని డైరెక్టర్ తెలిపారు. దీంతో సుజీత్ అప్డేట్‌తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రీక్వెల్‌లో అకీరా కచ్చితంగా ఉంటాడని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
కాగా ఇదే విషయాన్ని గతంలో పవన్ కల్యాణ్ కుడా వెల్లడించారు. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన ‘ఓజీ’ సక్సెస్ మీట్‌లో ఈ సినిమాకి ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటుందని పవన్ తెలిపారు. అయితే ఈ ప్రీక్వెల్ లేదా సీక్వెల్ పట్టాలెక్కేసరికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే త్వరలో నేచురల్ స్టార్ నాని, సుజీత్ కాంబోలో ఒక కొత్త చిత్రం రూపొందబోతుంది. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాతే ‘ఓజీ’ ప్రీక్వెల్‌గానీ సీక్వెల్‌గానీ మొదలయ్యే అవకాశాలున్నాయి. అయితే నానితో తీసే సినిమా ‘ఓజీ’ యూనివర్స్‌లో భాగం కాదని డైరెక్టర్ సుజీత్ క్లారిటీ ఇచ్చారు.