/rtv/media/media_files/2025/01/30/7oG0B2F2nR1BCBKgQfTD.jpg)
thandel day 1 collections
Thandel Day 1 Collections: చందూ మొండేటి(Chandu Mondeti) దర్శకత్వంలో నాగ చైతన్య- సాయి పల్లవి(Naga Chaitanya- Sai Pallavi) హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'తండేల్' బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. బుక్‌మై షోలో 24 గంటల్లో సుమారు 2 లక్షలకు పైగా ఈ మూవీ టికెట్స్ అమ్ముడయ్యాయి. సినిమాలోని మ్యూజిక్, చైతన్య- పల్లవి లవ్ స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. పాజిటివ్ రెస్పాన్స్ తో ఓపెనింగ్ డే నుంచే మంచి వసూళ్లను ఖాతాలో వేసుకుంటోంది.
Also Read: పాలు, నెయ్యి తినడం శరీరానికి హానికరమా? ఎప్పుడు, ఎంత తినాలో తెలుసుకుందాం!
డే 1 కలెక్షన్స్ ఎంతంటే..
తొలి రోజు ఈ చిత్రం భారతదేశంలోని అన్ని భాషలలో కలిపి మొదటి రోజు రూ. 10 కోట్ల మార్కును దాటింది. Sacnilk ప్రకారం, తెలుగులో 9.5 కోట్లు, హిందీలో 15 లక్షలు, తమిళంలో 5 లక్షలు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు వసూళ్లు దాదాపు రూ.16 కోట్లకు చేరుకోవచ్చని ట్రేడ్ వర్గాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 'తండేల్' జోరు బాగా కొనసాగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో దాదాపు రూ. 27.50 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ సేల్ జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. మొదటి రోజు తెలుగులో ఆక్యుపెన్సీని కూడా బలంగా సాధించింది. ఉదయం షోస్ లో 47.04% ఆక్యుపెన్సీని నమోదు చేయగా, మధ్యాహ్నం 44.76%, సాయంత్రం 51.40%, రాత్రి 71.10%కి వరకు ఆక్యుపెన్సీ పెరిగింది. మొత్తం తొలి రోజు 53.58%. ఆక్యుపెన్సీని సాధించింది.
Also Read: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై కేసు.. అసత్య ప్రచారం చేసినందుకేనా?
#Thandel hits the $400K mark at the USA box office🔥🇺🇸
— Prathyangira Cinemas (@PrathyangiraUS) February 8, 2025
The blockbuster journey is just heating up🤩#BlockbusterThandel@chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP @GeethaArts @TheBunnyVas @ThandelTheMovie pic.twitter.com/R9oi16xwZm
Also Read: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. ఫ్యాన్స్‌లో ఉత్తేజం నింపుతున్న జీతో బాజీ ఖేల్ కే సాంగ్
విదేశాల్లోనూ..
మరోవైపు విదేశాల్లోనూ తండేల్ జోరు బాగానే కొసాగుతోంది. ఓవర్సీస్ లో తొలి రోజు ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. 3 లక్షల 50వేల డాలర్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ పంచుకున్నారు. 'అలలు మరింత బలపడుతున్నాయి' అంటూ క్యాప్షన్ జోడించారు.
Also Read: Allu Aravind: బన్నీ డ్యాన్స్ చిరంజీవి నుంచి వచ్చింది కాదు.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్!