ACP Vishnu Murthy: అల్లు అర్జున్ కు మాస్ వార్నింగ్ ఇచ్చిన ACP మృతి.. పోలీస్ శాఖలో విషాదం!

ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. 'పుష్ప 2' ఘటనపై అల్లు అర్జున్‌కు ఘాటుగా వార్నింగ్‌ ఇవ్వడంతో ఆయన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించారు.

New Update
ACP Vishnu Murthy died after Heart attack allu arjun pushpa 2

ACP Vishnu Murthy died after Heart attack allu arjun pushpa 2

‘పుష్ప 2’(Pushpa 2) సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun) కు మాస్ వార్నింగ్ ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ACP సబ్బతి విష్ణుమూర్తి(acp sabbathi vishnumurthy) ఇక లేరు. ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఎన్నో ఏళ్లు డిపార్ట్‌మెంట్‌లో అనేక హోదాల్లో కొనసాగిన ఆయన ఆకస్మిక మరణం అందరినీ కలిచివేస్తోంది. నిరంతరం ప్రజా సేవ, ప్రజల భద్రతే ధ్యేయంగా ఆయన పనిచేశారని సహచరులు కొనియాడారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఏసీపీ విష్ణుమూర్తి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ పలువురు నివాళులర్పిస్తున్నారు. 

ACP Vishnu Murthy Died

Also Read :  ఘనంగా శివజ్యోతి సీమంతం వేడుక.. నటి హిమజ గిఫ్ట్ చూస్తే షాకవుతారు!

అల్లు అర్జున్‌కి ఏసీపీ మాస్ వార్నింగ్

అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌(hyderabad)లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ ప్రమాద ఘటనలో ఓ మహిళ మరణించడం, మరో బాలుడు తీవ్రంగా గాయపడటం జరిగింది. దీని తర్వాత అల్లు అర్జున్ వ్యవహరించిన తీరుపై సస్పెన్షన్‌లో ఉన్న ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ వ్యాఖ్యలు, వైఖరిపై ఘాటుగా స్పందించారు. ‘‘సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఒక నిందితుడిగా ఉన్నాడు. కేసు కోర్టులో విచారణలో ఉండగా, ముద్దాయి అయిన వ్యక్తి ప్రెస్‌మీట్ పెట్టి తన తప్పేమీ లేదని ఎలా చెప్పగలడు?’’ అని ప్రశ్నించారు.

Also Read :  ఈవారం ఓటీటీలో సందడే సందడి.. వార్2, మిరాయ్ సహా మొత్తం ఎన్నంటే?

అంతేకాకుండా పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని అల్లు అర్జున్‌ను హెచ్చరించారు. ‘‘డబ్బు మదంతో బడాబాబులు మాట్లాడుతున్నారు. పోలీసులనే బద్నాం చేస్తూ ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తున్నారు. పోలీసులంటే కనీస గౌరవం లేదా? మీ బౌన్సర్లను చూసుకుని ఓవరాక్షన్ చేస్తే అందరినీ లోపలేస్తాం’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఆయన అక్కడితో ఆగకుండా.. ‘‘అల్లు అర్జున్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. లేకుంటే చట్ట ప్రకారం తోలు తీస్తాం’’ అని తీవ్రమైన పదజాలంతో వార్నింగ్ ఇచ్చారు. ‘‘పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు అంటున్నావు.. నీకు ఎందుకు చెప్పాలి? నువ్వు ఏమన్నా తీస్‌మార్ ఖాన్ అనుకుంటున్నావా? నువ్వు కేవలం ఓ సామాన్య పౌరుడివి. చట్టం ముందు అందరూ సమానమే. సినిమా హీరోలకి ప్రత్యేక చట్టాలేమీ ఉండవు’’ అని ఆయన నిలదీశారు. ఇక ఈ వివాదంపై ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రెస్‌మీట్ నిర్వహించిన ఏసీపీ విష్ణుమూర్తిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆ సమయంలో హైదరాబాద్ పోలీసులు ప్రకటించడం గమనార్హం.

Advertisment
తాజా కథనాలు