Mirai Review: మళ్ళీ హిట్ కొట్టిన తేజ సజ్జా..మిరాయ్ గూస్ బంప్స్ గ్యారంటీ అంటూ రివ్యూలు

హనుమాన్ తర్వాత తేజా సజ్జా మళ్ళీ హిట్ కొట్టాడు. తాజాగా విడుదలైన మిరాయ్ సినిమా అదిరిపోయిందని టాక్ వస్తోంది. మొదటి షో చూసిన వారందరూ సినిమా అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

New Update
Mirai Making Video

Mirai Making Video

హీరో తేజా సజ్జా(Teja Sajja) కు ఫాంటసీ సినిమాల ఫార్ములా బాగా కలిసి వచ్చింది. హనుమాన్ సినిమాతో దేశ వ్యాప్తంగా బంపర్ హిట్ కొట్టిన తేజ ఇప్పుడు మిరాయ్ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టాడు. ఈరోజు మిరాయ్ సినిమా ఫస్ట్ షో పడింది. సినిమా అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లతో ముంచెత్తుతున్నారు. తేజా సజ్జా యాక్టింగ్, అద్భుతమైన విజువల్స్, బీజీఎమ్, సెకండాఫ్ లో హై మూమెంట్స్ అన్నీ కూడా అదిరిపోయాయని చెబుతున్నారు. ముఖ్యంగా సినిమాకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఫ్లస్ అయిందని ప్రేక్షకులు చెబుతున్నారు.

మొదటి షోకే సూపర్ టాక్..

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీవీ విశ్వప్రసాద్ తన కుమార్తె కృతి ప్రసాద్‌తో కలిసి మిరాయ్ చిత్రాన్ని నిర్మించారు. యాక్షన్, అడ్వంచర్, ఫాంటసీ, మైథాలజీ అంశాలతో అద్భుతమైన కథతో తెరక్కించారుమిరాయ్ మూవీని. ఇందులో తేజా సజ్జాతోపాటూ మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియ శరణ్ లు కీలక పాత్రల్లో నటించారు. థియేటర్ కు ముందే నాన్ థియేట్రికల్ బిజినెస్‌తో నిర్మాతకు రూ.20 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టిన ఈ చిత్రానికి సంబంధించి గురువారం రాత్రే ప్రీమియర్స్ పడ్డాయి.

Also Read :  మిరాయ్ లో ప్రభాస్..! ఈ ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా

కథ..

అశోక చక్రవర్తి కాలంలో సృష్టించబడిన తొమ్మిది పవిత్ర గ్రంథాలు మానవులను దేవుళ్లుగా మార్చే శక్తిని కలిగి ఉన్న పౌరాణిక-భవిష్యత్ విశ్వంలో మిరాయ్ ప్రారంభమవుతుంది. మంచు మనోజ్ నేతృత్వంలోని దుష్ట బ్లాక్ స్వోర్డ్ వంశం ఈ గ్రంథాలను స్వాధీనం చేసుకుని, చీకటి కోసం దైవిక శక్తిని ఉపయోగించాలని పథకం వేస్తుంది. తన ప్రకాశవంతమైన దైవిక దండం - మిరాయ్‌తో ఈ అవశేషాలను రక్షించడానికి ఉద్దేశించిన ఎంపిక చేయబడిన యోధుడు సూపర్ యోధగా తేజ సజ్జ ప్రవేశిస్తాడు . సినిమా ప్రారంభంలో, సూపర్ యోధ సందేహంతో కుస్తీ పడుతుండటం మనం చూస్తాము. సినిమా మొదట్లో ఇవేమీ నమ్మని హీరో తేజా సజ్జా..చివరకు దైవిక శక్తిని ఎలా కాపాడతాడు అన్నదే సినిమా. ఇందులో హీరో తల్లిగా శ్రియ, హీరోయిన్ రితికాలుతేజాను లక్ష్యం వైపు నడిపించేలా చేస్తారు.

ఫాంటసీ కథకు తగ్గట్టుకట్టిపడేసే దృశ్యాలు మిరాయ్ సినిమాలో ఉన్నాయని చెబుతున్నారు. దానికి తగ్గట్టువీఎఫ్ఎక్స్ ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే హై మూమెంట్స్ సినిమాను అస్సలు మిస్ అవకూడదనేలా చేశాయని చెబుతున్నారు. 

Also Read :  స్పెయిన్‌ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్న యానిమల్ బ్యూటీ.. ఫొటోలు చూశారా?

ఈ మూవీలో ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాదు చివర్లో కనిపిస్తాడు కూడా అని అంటున్నారు. అదొక పెద్ద సర్ ప్రైజ్ అని చెబుతున్నారు. ఒక్క వాయిస్ ఓవర్‌తోనే సినిమా మొత్తం రెబల్ వైబ్‌లోకి వెళ్లిపోయింది. ఆయన పేరు వినిపిస్తే అలాగే ఉంటుందని అంటున్నారు. 

కల్కి సినిమా కన్నా మిరాయ్ బాగుందని చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) కనిపిస్తాడని తెలుస్తోంది. సోసల్ మీడియాలో ఆయన లుక్ ఫోటోలు కూడా పెడుతున్నారు. అయితే పాత్ర ఏంటన్నది ఎక్కడా మాత్రం రివీల్ చేయడం లేదు. పిక్స్ ని బట్టి చూస్తే రాములు లేదా కృష్ణుడు అవ్వొచ్చని తెలుస్తోంది. 

మిరాయ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం గ్యారంటీ అని రివ్యూలు ఇస్తున్నారు.  మైండ్ బ్లోయింగ్ విజువల్ ట్రీట్ ఈ సినిమా అని చెబుతున్నారు. అద్భుతమైన కథనా శైలి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ప్రభాస్ ఎంట్రీతో థియేటర్లు అల్లకల్లోలంగా మారిపోయాయని.. బీజీఎంతో భూమి కంపించేలా ఉందని పోస్ట్ లు పెడుతున్నారు. 

పాజిటివ్ రివ్యూలతో పాటూ నెగిటివ్ రివ్యూలు కూడా ఒకటి, రెండు కనిపిస్తున్నాయి. హనుమాన్ సినిమా అంత లేదని చెబుతున్నారు. కానీ ఎక్కువగా పాజిటివ్ టాకే వినిపిస్తుండడంతో మిరాయ్ సినిమా హిట్ కొట్టిందని కన్ఫార్మ చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు