Prabhas in Mirai: మిరాయ్ లో ప్రభాస్..! ఈ ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా

రేపు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న మిరై మూవీ లో ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉందట. సినిమా ఆరంభంలో రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఉందన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తేజ సజ్జ కూడా ట్వీట్ చేయడం విశేషంగా మారింది.

New Update
Prabhas in Mirai

Prabhas in Mirai

Prabhas in Mirai: టాలీవుడ్‌లో యంగ్ హీరోగా తనదైన మార్క్ వేసుకున్న తేజ సజ్జా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’ (Mirai) సెప్టెంబర్ 13న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ చిత్రం పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

సూపర్ యోధుడిగా తేజ సజ్జా

ఈ సినిమాలో తేజ సజ్జా పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నాడు. సూపర్ యోధుడిగా అతను పోరాట సన్నివేశాలలో సందడి చేయనున్నాడు. ఈ కథను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. విజువల్స్, స్టైల్, కథనం అన్నీ గేమ్ ఛేంజర్ లా ఉంటాయని టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.

ప్రభాస్ సర్‌ప్రైజ్.. 

ఇది వరకు అధికారికంగా వెల్లడించనప్పటికీ, చిత్ర యూనిట్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ సినిమాకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ ప్రత్యేకమైన టచ్ ఇచ్చాడట. అంటే.. సినిమా ఆరంభంలోనే ప్రభాస్ వాయిస్ ఓవర్ ఉందన్న టాక్ హాట్ టాపిక్ అయింది. ఆయన స్వరంతో వచ్చే ఓపెనింగ్ నేరేషన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని భావిస్తున్నారు. ప్రభాస్ అభిమానులకైతే ఇది ఓ స్పెషల్ ట్రీట్‌ అవుతుందని చెప్పొచ్చు.

మంచు మనోజ్ విలన్‌గా

ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించడమే. చాలా కాలం తర్వాత మనోజ్ తెరపై కనిపించబోతుండగా, ఈసారి పూర్తిగా నెగెటివ్ షేడ్‌లో కనిపించనున్నాడు. ట్రైలర్‌లోనే అతని లుక్‌కి, నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తేజ సజ్జాకు జోడీగా రితికా నాయక్ నటించగా, ఈ సినిమాలోని మ్యూజిక్‌కు గౌర హరి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి.


ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. వీఎఫ్‌ఎక్స్, ప్రొడక్షన్ విలువలు చూస్తే ఇది పక్కా పాన్-ఇండియా లెవెల్ మూవీ అన్నదే స్పష్టమవుతుంది. ట్రైలర్‌లో చూపిన సన్నివేశాలు, యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

Advertisment
తాజా కథనాలు