Jack Movie OTT: టిల్లుగాని ‘బేబీ’ కిస్.. ఓటీటీలోకి సిద్ధూ రొమాంటిక్ మూవీ

సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘జాక్’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌‌కు సిద్ధమైంది. ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ వేదికగా మే 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

New Update
jack movie streaming on netflix at may 8th

jack movie streaming on netflix at may 8th

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు హీరో సిద్ధూ జొన్నలగడ్డ. అదే సమయంలో బేబీ మూవీతో ఓవర్ నైట్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది అందాల ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య. ఇక ఇద్దరూ చెరో హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉండగా.. ‘జాక్’ మూవీతో ఒక్కటయ్యారు. సిద్ధూ, వైష్ణవి కలిసి ‘జాక్’ మూవీలో జోడీగా నటించారు. 

Also Read :  కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!

ఎన్నో అంచనాలతో ఈ చిత్రం తెరకెక్కింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంపై మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది. స్పై, యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం అందరి అంచనాలను తలకిందులు చేసింది. 

Also Read :  దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్

ఓటీటీలోకి జాక్

ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ అందుకుంది. ఇందులో హీరో, హీరోయిన్ పెర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా.. స్టోరీ పెద్దగా ఎవరికీ ఎక్కలేదు. దీంతో ఊహించిన దానికంటే దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. ఇక థియేటర్లలో పెద్దగా పెర్ఫార్మ్ చేయని ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖు ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. 

Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!

దీంతో కుదుర్చుకున్న డీల్ ప్రకారమే.. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల అంటే మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. 

Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం

siddu-jonnalagadda | heroine-vaishnavi | Vaishnavi Chaitanya | Jack Movie | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు