Maa Inti Bangaram: పవర్‌ఫుల్ యాక్షన్‌తో సమంత 'మా ఇంటి బంగారం' టీజర్.. ఫ్యాన్స్‌కు పండగే!

సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ మూవీ నుంచి తాజాగా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చాలా సాఫ్ట్‌గా టీజర్ మొదట్లో కనిపించినా ఆ తర్వాత యాక్షన్ సీన్స్‌తో సమంత అదరగొట్టింది.

New Update
samantha

samantha

సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి(B. V. Nandini Reddy) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ మూవీ నుంచి తాజాగా టీజర్‌(Maa Inti Bangaram Teaser) ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చాలా సాఫ్ట్‌గా టీజర్ మొదట్లో కనిపించినా ఆ తర్వాత యాక్షన్ సీన్స్‌తో సమంత అదరగొట్టింది. టీజర్ ప్రారంభంలో సమంత చాలా సాదాసీదాగా, మధ్యతరగతి గృహిణిలా కనిపిస్తారు. "చూస్తా ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరిలో కలిసిపోతుంది" అంటూ ఆమె చెప్పే డైలాగ్ వినడానికి అమాయకంగా ఉంటుంది. కానీ.. టీజర్ మధ్యలో మాత్రమే అసలైన స్టోరీ మొదలు అవుతుంది. ఆమెలోని అసలైన యాక్షన్ వెర్షన్ బయటకు వస్తుంది.

ఇది కూడా చూడండి: The Raja Saab Twitter Review: ది రాజాసాబ్ ట్విట్టర్ రివ్యూ.. దెబ్బకొట్టిన ప్రభాస్.. నిరాశలో ఫ్యాన్స్!

నటనతో మెప్పించిన సమంత

అందరిలో కలిసిపోయే ఒక సాధారణ మహిళ, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా వెనుకాడదని ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. అయితే సమంత(actress-samantha) నటన కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏమాయ చేశావే మూవీ నుంచి ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో తన నటనకు ప్రశంసలు వచ్చాయి. అయితే ఈ మా ఇంటి బంగారం(maa-inti-bangaram) మూవీలో కూడా ఆమె నటన సరికొత్తగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఫైట్స్ మాత్రమే కాకుండా.. ఒక గృహిణికి ఉండే భావోద్వేగాలను పండిస్తూనే, అవసరమైనప్పుడు శత్రువుల తాట తీసే వీరనారిగా ఆమె కనిపిస్తున్నారు. మేకప్‌తో పాటు ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే చెప్పక్కర్లేదు. 

గతంలో సమంత, నందిని రెడ్డి దర్శకత్వంతో ఓ బేబీ మూవీ వచ్చి సూపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ యాక్షన్ డ్రామా అదిరిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇందులో యాక్షన్‌తో పాటు ఎమోషన్స్, స్ట్రాంగ్ స్టోరీ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే టీజర్ సంగీతం, సినిమాటోగ్రఫీ సూపర్‌గా ఉన్నాయి. చాలా ఏళ్ల తర్వాత సమంత పవర్ ఫుల్ యాక్షన్ రోల్‌లో కనిపిస్తోంది. మరి టీజర్ ఇలా ఉంటే ట్రైలర్, సినిమా ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. "లేడీ సూపర్ స్టార్ ఈజ్ బ్యాక్" ఫ్యాన్స్‌కు పండగే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. - viral

Advertisment
తాజా కథనాలు