/rtv/media/media_files/2026/01/09/rajasaab-2026-01-09-09-19-17.jpg)
Rajasaab
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas), మారుతి దర్శకత్వం(Director Maruthi) లో రూపొందిన 'ది రాజాసాబ్'(The Raja Saab) సినిమాపై భారీగా అంచనాలు ఉండేవి. కానీ సినిమా ప్రీమియర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం మారిపోయాయి. హార్రర్ కామెడీ థ్రిల్లర్‌లో ముగ్గురు హీరోయిన్లతో మారుతి గట్టిగానే ప్లాన్ చేశాడని అందరూ భావించారు. కానీ వారి ఆలోచనలు అన్ని కూడా మారిపోయాయి. డైరెక్టర్ మారుతి ప్రభాస్ స్టార్‌డమ్‌ను ఉపయోగించుకోలేకపోయాడని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ది రాజాసాబ్ మూవీ ఎలా ఉందో ఫుల్ రివ్యూ(The RajaSaab Movie Review) లో తెలుసుకుందాం.
Also Read : పవర్‌ఫుల్ యాక్షన్‌తో సమంత 'మా ఇంటి బంగారం' టీజర్.. ఫ్యాన్స్‌కు పండగే!
కథ ఏంటంటే?
దేవనగర సంస్థానానికి జమిందారు అయిన గంగాదేవి (జరీనా వహాబ్), తన మనవడు రాజు (ప్రభాస్)తో కలిసి సాదాసీదా జీవితం గడుపుతుంటుంది. గంగాదేవికి మతిమరుపు ఉండటంతో అన్ని విషయాలు మరిచిపోతుంది. కానీ తన భర్త కనకరాజు (సంజయ్‌దత్)ని మాత్రం అసలు మరిచిపోదు. ఎప్పటికప్పుడు కలలో తనకు కనిపించడంతో, భర్తను తీసుకురమ్మని మనవడు రాజాసాబ్(ప్రభాస్)కు చెబుతుంది. అయితే కనకరాజు సామాన్యుడు కాదు.. అతనికి ఎన్నో మార్మిక శక్తులు, మంత్రవిద్యలు తెలుసు. తనే స్వయంగా మాయోపాయంతో తన భార్యను, మనవడిని నర్సాపూర్ అడవిలోని ఒక పాత రాజమహల్‌కు వచ్చేలా చేస్తాడు. ఆ కోటలోకి అడుగుపెట్టిన తర్వాత వారిద్దరినీ చంపాలని కనకరాజు పథకం వేస్తాడు. భయంకరమైన శక్తులున్న తాతను మనవడు రాజాసాబ్ ఎలా ఎదిరించాడు? కనకరాజు అసలు ఉద్దేశ్యం ఏమిటి? ఈ ప్రయాణంలో అతనికి పరిచయమైన భైరవి (మాళవిక మోహనన్), బ్లెస్సీ (నిధి అగర్వాల్), అనిత (రిద్ధి కుమార్)ల పాత్రలేమిటి? అనే విషయం తెలియాలంటే థియేటర్లలో మూవీ చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ప్రభాస్ చాలా కాలం నుంచి భారీ యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. కానీ ఈసారి హారర్ ఫాంటసీ కొత్త జోనర్‌ను ఎంచుకున్నారు. అయితే ఈ సినిమాలో ఒకప్పటి వింటేజ్ డార్లింగ్‌ను చూసినట్లు అనిపిస్తుంది. అయితే మారుతి రావు రాసుకున్నట్లు కథను స్క్రీన్ ప్లే చేయలేకపోయాడు. కానీ ప్రభాస్ కామెడీ, వింటేజ్ లుక్, యాక్టింగ్ ఫ్యాన్స్‌ను మెప్పిస్తాయి. ఫస్ట్ పార్ట్ అంతా బాగానే ఉంటుంది. కానీ సెకండ్ పార్ట్ కాస్త స్లో అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ రాజమహల్‌లోకి ప్రవేశించే సీన్ మాత్రమే కాస్త ఉత్కంఠ కలిగిస్తుంది. కథలో సరైన టెన్షన్ లేకపోవడం వల్ల హారర్ సన్నివేశాలు అంతగా భయపెట్టవు. కొన్ని దగ్గర్ల కాస్త భయపెట్టే విధంగా సీన్లు ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ట్రైలర్‌లో చూపించిన చాలా సన్నివేశాలు సినిమాలో కనిపించలేదు. ‘రాజాసాబ్ సర్కస్’అంటూ కొనసాగింపునకు లీడ్ ఇచ్చారు. అంటే రెండో పార్ట్ కూడా ఉందని తెలిపారు.
ప్రభాస్ నటన, లుక్స్
చాలా కాలం తర్వాత ప్రభాస్ ఒక వినోదాత్మకమైన పాత్రలో కనిపించారు. ముఖ్యంగా కామెడీ టైమింగ్, డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను అలరిస్తాయి. సినిమా ప్రచార చిత్రాల్లో చూపించినట్లుగానే ప్రభాస్ వింటేజ్ లుక్ చాలా బాగుంది. యాక్షన్ సన్నివేశాల్లో తనదైన శైలిలో మెప్పించారు. కథానాయికల్లో మాళవిక మోహనన్ ఎక్కువ సమయం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆమె అందం, నటన బాగున్నాయి. అయితే నిధి అగర్వాల్ పాటల్లో మాత్రమే ప్రధాన ఆకర్షణగా కనిపించింది. ఇక రిద్దికుమార్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదని చెప్పవచ్చు. సంజయ్ దత్, జరీనా వాహబ్ పాత్ర ఈ సినిమాకి ముఖ్యంగా నిలిచాయి.
ప్రభాస్ స్టార్‌డమ్‌ను మారుతి యూజ్ చేసుకోలేదా?
మారుతి ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‌ను హ్యాండిల్ చేయలేకపోయాడని చెప్పవచ్చు. సినిమాలోని మొదటి భాగం కామెడీ, సరదా సన్నివేశాలతో సాగిపోయినా, సెకండాఫ్ ఆశించిన స్థాయిలో లేదు. ప్రభాస్ అంటే మాస్ ఆడియన్స్ ఆశించే ఎలివేషన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో తక్కువగా ఉన్నాయి. సడెన్‌గా ప్రభాస్ ఇలా కామెడీ జోనర్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ తీసుకోలేకపోతున్నారు.
సాంకేతిక వర్గం
సినిమాలో థమన్ సంగీతం ప్లస్ పాయింట్‌గా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హర్రర్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పర్వాలేదనిపిస్తాయి. ముఖ్యంగా కోట సెట్టింగ్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. అయితే ఎడిటింగ్ విషయంలో మరికొంత జాగ్రత్త వహించి ఉంటే సినిమా వేగం పెరిగేది. కొన్ని సాగతీత సీన్లు ప్రేక్షకులకు కొంత బోర్ కలిగిస్తాయి.
చివరిగా..
మొత్తంగా చెప్పాలంటే.. 'ది రాజాసాబ్' ప్రభాస్ అభిమానులకు ఒక విందు లాంటిదే. కానీ సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఇది ఒక యావరేజ్ మూవీగా అనిపిస్తుంది. ప్రభాస్‌ను సరికొత్త లుక్‌లో చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. మారుతి కామెడీ పండించినప్పటికీ, ప్రభాస్ స్టార్‌డమ్‌ను పూర్తిస్థాయిలో వాడుకోవడంలో కొంత తడబడ్డాడనిపిస్తుంది.
Also Read : ఆ సంక్రాంతి సినిమాలో 'ఫరియా అబ్దుల్లా' క్యామియో..! రోల్ ఏంటో తెలుసా..?
రేటింగ్: 2.25
Follow Us