The Raja Saab Twitter Review: ది రాజాసాబ్ ట్విట్టర్ రివ్యూ.. దెబ్బకొట్టిన ప్రభాస్.. నిరాశలో ఫ్యాన్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెబల్ స్టార్ మూవీ వస్తుందంటే ఫ్యాన్స్‌కు పండగని చెప్పవచ్చు. ప్రీమియర్స్ నుంచే థియేటర్లలో సందడి నెలకొంది. మరి ఈ హారర్ థ్రిల్లర్ ది రాజాసాబ్ మూవీ ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.

New Update
TheRajasaab

TheRajasaab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెబల్ స్టార్ మూవీ వస్తుందంటే ఫ్యాన్స్‌కు పండగని చెప్పవచ్చు. ప్రీమియర్స్ నుంచే థియేటర్లలో సందడి నెలకొంది. అందులోనూ ప్రభాస్ ఈసారి ఒకటే జోనర్‌లో కాకుండా హారర్ కామెడీ థ్రిల్లర్‌లో ది రాజాసాబ్ నేడు థియేటర్లలోకి వచ్చింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కనిపించారు. మరి ఈ హారర్ థ్రిల్లర్ ది రాజాసాబ్ మూవీ ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.

ది రాజాసాబ్ మూవీ టైటిల్ కార్డ్‌తోనే ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. సినిమా మొదటి నుంచి సూపర్‌గా ఉందని కొందరు ఫ్యాన్స్ ట్విట్టర్‌లో రివ్యూ ఇస్తున్నారు. రెబల్ స్టార్ ఎంట్రీ అయితే మస్త్ ఉందని, డ్యాన్స్ కూడా బాగా చేశారని అంటున్నారు.

సినిమా బోర్ కొడుతుందని..

మూవీ ఫస్టాప్ బోర్ కొడుతుందని, ఒక్క సీన్ కూడా నచ్చలేదని సినిమాకు వెళ్లడం డబ్బులు వేస్ట్ అని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ ఫేస్ కూడా సరిగ్గా కనిపించడం లేదని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

ఫస్టాప్ బాగుందని, వింటేజ్ ప్రభాస్ కనిపిస్తాడని మరికొందరు అంటున్నారు. ప్రభాస్ కామెడీ, అతని ఎనర్జీ, డ్యాన్స్ అన్ని అయితే అభిమానులకు ఫుల్ ట్రీట్ అని ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యంగా మూవీ ప్రీ ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ అదిరిపోయిందని అంటున్నారు. లాస్ట్ 30 నిమిషాలు అయితే సూపర్‌గా ఉందని కామెంట్లు చేస్తున్నారు. సినిమా మొత్తం మీద చూసుకుంటే పాటలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదని, తమన్ బీజీఎం, ప్రభాస్ యాక్టింగ్ సినిమాకు ప్లస్ అని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ప్రభాస్‌ను ఈ యాంగిల్‌లో చూడలేదని ఫ్యాన్స్ అంటున్నారు. డైరెక్టర్ మారుతి కూడా కథను రాసుకున్న విధంగా స్క్రీన్‌పై చూపించలేకపోయారు. రొటీన్ స్టోరీలో ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. 

ట్రైలర్‌లో చూపించిన కొన్ని సీన్లు మూవీలో లేవని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ముఖ్యంగా ఫైట్లు, తాత గెటప్‌లో రాజాసాబ్ సీన్లు కనిపించలేదు. ఇవన్నీ సెకండ్ పార్ట్‌లో ఉంటాయి ఏమోనని ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యమైన సీన్లు లేకపోవడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు