Rashmika Mysa: 'మైసా' లుక్ లో భయపెడుతున్న రష్మిక ! పోస్టర్ అదిరిపోయింది

నటి రష్మిక మందన్న మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. 'మైసా' అనే టైటిల్ తో ఈ సినిమాను ప్రకటించారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా.. అందులో రష్మిక చేతిలో కత్తి పట్టుకొని యోధురాలిగా పవర్ ఫుల్ లుక్ లో కనిపించింది.

New Update
rashmika mysa first look

rashmika mysa first look

టాలీవుడ్,  బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న నేషనల్ క్రష్ రష్మిక తన కెరీర్ లో మరో కొత్త అడుగు వేసింది. మునుపెన్నడూ చేయని, కనిపించని ఒక  'వైల్డ్ అవతార్' లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. 'మైసా'  అంటూ మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. ఇందులో రష్మిక ఒక యోధురాలిగా కనిపించనుంది. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా..  సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఇందులో రష్మిక చేతిలో కత్తి పట్టుకొని, భయంకరమైన గర్జనతో పవర్ ఫుల్ లుక్ లో కనిపించింది. ఈ సినిమాలో రష్మిక ఇంతకముందు ఎప్పుడూ కనిపించని ఓ  భిన్నమైన పాత్రను పోషించనుంది. "Hunted. Wounded. Unbroken'' అనే ట్యాగ్‌లైన్ సినిమా కథనం ఎంత ఉత్కంఠగా ఉండబోతుందో స్పష్టం చేసింది. 

Also Read :  జూలైలో స్మార్ట్‌ఫోన్ల జాతరే జాతర.. నథింగ్, శాంసంగ్, వన్‌ప్లస్ నుంచి కిర్రాక్ మొబైల్స్!

Also Read :  రాజ్‌తరుణ్‌-లావణ్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. ఊహించని షాకిచ్చిన హైకోర్టు

అర్ధ శతాబ్దం డైరెక్టర్ 

'అర్ధ శతాబ్దం' ఫేమ్ రవీంద్ర పూలే దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  'అన్‌ఫార్ములా ఫిల్మ్స్' బ్యానర్‌పై అజయ్,  అనిల్ సాయపరెడ్డిల నిర్మిస్తున్నారు. 'మైసా' సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కానుంది.  అలాగే ఇది రష్మిక కెరీర్‌లో మరో కీలక ప్రాజెక్ట్ కానుంది. ముఖ్యంగా, ఈ ప్రాజెక్ట్  హీరోయిన్-సెంట్రిక్ కథనం కావడంతో, రష్మిక నటనకు పూర్తి ఆస్కారం ఉంటుంది. 

Also Read :  మరి కాసేపట్లో స్క్విడ్ గేమ్ ఆఖరి పోరు! ఇండియాలో స్ట్రీమింగ్ టైమ్ ఇదే

వరుస విజయాలు 

ఇటీవలే కుబేరా  రీసెంట్ గా  'యానిమల్', 'పుష్ప 2' ఛావా  వంటి విజయాలతో రష్మిక ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇప్పుడు 'మైసా'తో  ఆమెలోని మరో  కొత్త కోణాన్ని పరిచయం చేసేందుకు  సిద్ధమవుతోంది. ఈ సినిమా రష్మిక కెరీర్‌లో ఒక ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: Kannappa Twitter Review: ‘కన్నప్ప’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. మంచు విష్ణు, ప్రభాస్ చించేశారా?- మూవీ ఎలా ఉందంటే?

 

telugu-news | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | Mysa | 2025 Tollywood movies

Advertisment
Advertisment
తాజా కథనాలు