Squid Game 3: మరి కాసేపట్లో స్క్విడ్ గేమ్ ఆఖరి పోరు! ఇండియాలో స్ట్రీమింగ్ టైమ్ ఇదే

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాపులర్ కొరియన్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'  చివరి సీజన్ ఈరోజు నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇండియాలో  మధ్యాహ్నం 12:30 గంటల నుంచి  ఈ సిరీస్‌ను చూడవచ్చు.

New Update

Squid Game 3:  ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాపులర్ కొరియన్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'  చివరి సీజన్ ఈరోజు నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇండియాలో  మధ్యాహ్నం 12:30 గంటల నుంచి  ఈ సిరీస్‌ను చూడవచ్చు. ఇందులో మొత్తం మొత్తం ఆరు ఎపిసోడ్‌లు ఉండనున్నాయి. హ్యాంగ్ డాంగ్ డైరెక్ట్ చేసిన ఈ సీరీస్ లో లీ జంగ్-జే, లీ బైయుంగ్- హున్, వి హా-జూన్ ప్రధాన పాత్రలు పోషించారు.  జీవితంలో  అప్పులపాలై  నిస్సహాయస్థితిలో ఉన్న 456 మందిని ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి.. రెడ్‌లైట్‌.. గ్రీన్‌ లైట్‌ లాంటి కొన్ని ఆటలు నిర్వహిస్తారు.

అక్కడికి వెళ్లిన తర్వాత  డబ్బు కోసం వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారనే దాని చుట్టూ ఈ సిరీస్‌ తిరుగుతుంది.  ఇప్పుడు ఈ ఆట ముగింపు దశకు చేరుకుంది. ఈ చివరి గేమ్ లో  జి-హున్ ఈ ప్రాణాంతక ఆటను శాశ్వతంగా ఆపాలని ప్రయత్నిస్తాడు. అలాగే  ఫ్రంట్ మ్యాన్ అసలు స్వరూపాన్ని బయటపెట్టడం వంటి అంశాలు ఇందులో ప్రధానంగా చూపించబడతాయి.  ఇప్పటికే విడుదలైన 2 సీజన్స్ సూపర్ హిట్ కావడంతో సీజన్ 3 ప్లాన్ చేశారు. 

ట్రైలర్ లో ఏముంది?

సీజన్ 3 లో గత  సీజన్లలో ఉన్న ప్లేయర్లు మళ్లీ కనిపించనున్నారు. అంతేకాదు ట్రైలర్  చివరిలో ఒక బిడ్డ ఏడుపు  వినిపించడం.. అభిమానుల్లో   కొత్త  ఊహాగానాలకు దారితీసింది. అలాగే  గంబాల్ మెషిన్ తిరిగి కనిపించింది.  సీజన్ 2 ముగిసిన చోట నుంచే కథ కొనసాగుతుంది. జి-హున్   తిరిగి ఆటలోకి అడుగుపెడతాడు.  తానూ తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించి విఫలమైన తర్వాత ఈ సారి  ఆటను శాశ్వతంగా ముగించాలనే ధృడ సంకల్పంతో తిరిగి వస్తాడు.

Also Read: Chiranjeevi: శేఖర్ కమ్ముల చేయి వేయగానే చిరంజీవి ఎలా చేశారో చూడండి! వీడియో వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు