Raj Tarun - Lavanya: రాజ్‌తరుణ్‌-లావణ్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. ఊహించని షాకిచ్చిన హైకోర్టు

రాజ్‌తరుణ్‌-లావణ్య ఇంటి వివాదం కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. రాజ్‌ ఇంట్లో ఉండేందుకు లావణ్యకు అర్హత లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. లావణ్య, రాజ్‌ తరుణ్ భార్య అనడానికి ఎలాంటి ఆధారం లేదని.. ఏమైనా కేసులుంటే సివిల్‌ కోర్టులో తేల్చుకోవాలంది.

New Update
raj tarun and lavanya shock

raj tarun and lavanya house case big twist

రాజ్‌తరుణ్‌-లావణ్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. తెలంగాణ హైకోర్టు లావణ్యకు బిగ్ షాకిచ్చింది. గత కొన్ని నెలలుగా కోకాపేటలోని పుప్పాలగూడలో ఉన్న రాజ్ తరుణ్ ఇంటి విషయంలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు లావణ్యకు షాక్ ఇచ్చింది. 

Also Read: సైబర్‌ నేరాలపై సీబీఐ ఉక్కుపాదం..  700 బ్యాంకుల్లో 8.5 లక్షల మ్యూల్ ఖాతాల గుర్తింపు

లావణ్యకు బిగ్ షాక్

రాజ్‌ ఇంట్లో ఉండేందుకు అర్హత లేదని తెలిపింది. అంతేకాకుండా లావణ్య, రాజ్‌ తరుణ్ భార్య అనడానికి ఎలాంటి ఆధారం లేదని పేర్కొంది. వీటితో పాటు ఆ ఇల్లు లావణ్యదని ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. అందువల్ల రాజ్ తరుణ్ ఇంట్లో ఉండేందుకు లావణ్యకు ఎలాంటి అధికారం లేదని వెల్లడించింది. 

Also Read: టోల్‌ ట్యాక్స్‌ కట్టాలని అడిగినందుకు.. తుపాకీతో కాల్పులు

ఇక లావణ్యకు ఎలాంటి పోలీస్‌ ప్రొటెక్షన్‌ ఇవ్వడం కుదరదని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఇంకా ఏమైనా కేసులు ఉంటే సివిల్‌ కోర్టులో తేల్చుకోవాలని.. ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దంటూ లావణ్యకు కోర్టు చురకలు అంటించింది. దీంతో రాజ్ తరుణ్ - లావణ్య ఇంటి వివాదం ఇక్కడితో చెక్ పడుతుందా? లేకా మరేదైన మలుపు తిరుగుతుందా? అనేది చూడాలి. 

ఏం జరిగిందంటే?

హీరో రాజ్ తరుణ్ - లావణ్యల ఎపిసోడ్ గత ఏడాది నుంచి ఎంతటి హాట్ టాపిక్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. అన్ని విధాలుగా వాడుకుని వదిలేసి వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడంటూ లావణ్య మొదట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి మొదలైన వీరి తతంగం.. ఇప్పటికీ ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. 

ఇళ్లు అమ్మేసిన రాజ్

ఇటీవలే కోకాపేటలోని పుప్పాలగూడలో రాజ్ తరుణ్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు.. లావణ్యకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాజ్ తరుణ్ ఇంట్లో నివాసం ఉంటున్న లావణ్య.. ఆ ఇంటిని వెంటనే ఖాళీ చేయాలని రాజ్ తల్లిదండ్రులు ఏప్రిల్ 16న ఆందోళనకు దిగారు. ఆ సమయంలో ఇరువురి మధ్య మాటల యుద్దం జరిగింది. కానీ ఆ ఇంటిని రాజ్ తరుణ్ జనవరిలోనే వేరే వాళ్లకు అమ్మేశాడని సమాచారం. ఆ విషయం తెలిసే లావణ్య ఆ ఇంటిని ఖాళీ చేయకుండా అక్కడే ఉంటుంది.

Raj Tarun | big twist in raj tarun lavanya case | lavanya about raj tarun

Advertisment
Advertisment
తాజా కథనాలు