/rtv/media/media_files/2026/02/26/rashmika-2026-02-26-20-08-25.jpg)
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna)ల మధ్య ఇన్నాళ్లుగా సాగిన సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. ఇద్దరి పెళ్లి గ్రాండ్ గా రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లో జరిగింది. అనంతరం ఇద్దరు తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా(Social Media) లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రష్మిక తన ఇన్స్టాగ్రామ్(instagram) వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టారు. విజయ్ను 'నా భర్త' అని సంబోధిస్తూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విజయ్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ రష్మిక అత్యంత ఎమోషనల్ నోట్‌ను షేర్ చేసింది. అసలైన ప్రేమ అంటే ఏంటో, మనశ్శాంతి అంటే ఎలా ఉంటుందో విజయ్ తనకు నేర్పించాడని ఆమె పేర్కొంది. "పెద్ద కలలు కనడం తప్పు కాదని, నా సామర్థ్యంపై నాకు నమ్మకం కలిగేలా విజయ్ ప్రతిరోజూ ప్రోత్సహించాడు. ఎవరూ చూడటం లేదన్నంత స్వేచ్ఛగా నన్ను ఉండనిచ్చాడు. నిజం చెప్పాలంటే అతని గురించి నేను ఒక పుస్తకమే రాయగలను" అని రష్మిక తన మనసులోని మాటలను బయటపెట్టింది.
Also Read : అనిల్ రావిపూడి భారీ మల్టీస్టారర్.. దగ్గుబాటి, నందమూరి హీరోలతో
మహాభారత కాన్సెప్ట్‌లో సీతారాముల కళ్యాణం 🔥#VijayDeverakonda#RashmikaMandana#Viroshpic.twitter.com/gotXZZ1dGP
— Milagro Movies (@MilagroMovies) February 26, 2026
Also Read : ఇట్స్ పూల్ టైమ్.. తడి అందాలతో రెచ్చిపోయిన నేహా శర్మ
ఈరోజు నీ వల్లే సాధ్యమైంది
తన ఈ స్థాయికి, తన ఎదుగుదలకు విజయ్ ప్రధాన కారణమని రష్మిక చెప్పుకొచ్చింది. "నేను ఏ స్థాయికి చేరాలని కలలు కన్నానో, అది ఈరోజు నీ వల్లే సాధ్యమైంది. నా కష్టసుఖాల్లో, విజయాల్లో అతిపెద్ద భాగస్వామిగా నువ్వు ఉన్నావు. నీ భార్యనవుతున్నందుకు, నిన్ను పెళ్లి చేసుకుంటున్నందుకు నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ఇక నుంచి మన జీవితం ఒక ఫుల్ పార్టీలా ఉండబోతోంది. ఐ లవ్ యూ విజయ్" అంటూ ఆమె పోస్ట్‌ను ముగించింది.
ఇన్నాళ్లూ వీరిద్దరి గురించి వస్తున్న రూమర్లకు ఈ పోస్ట్‌తో అధికారికంగా ఫుల్ స్టాప్ పడటంతో, అభిమానులు ఈ క్రేజీ జంటకు సోషల్ మీడియాలో భారీగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా గీత గోవిందం (2018). పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇందులో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమా టైమ్ లోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లుగా వార్తలు వచ్చాయి. 2019లో డియర్ కామ్రేడ్ ఈ జంట మరోసారి స్ర్కీన్ పైన తళుక్కుమంది. కేవలం ఈ రెండు సినిమాలతోనే ఈ జంట టాలీవుడ్లో మోస్ట్ క్రేజీ కాంబో గా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే వీరు నిజజీవితంలో కూడా ఒకటి కావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇప్పుడిది నిజం అయింది.
Follow Us