Param Sundari: జాన్వీ కపూర్- సిద్దార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'పరమ్ సుందరి'. ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా మూవీ నుంచి 'భీగీ సారీ' అనే కొత్త పాట విడుదలైంది. జాన్వీ, సిద్దార్థ్ మల్హోత్రాపై చిత్రీకరించిన ఈ రొమాంటిక్ పాట ఆకట్టుకుంటోంది. ఇందులో జాన్వీ తడిసిన చీరలో హాట్ గా కనిపిస్తోంది. అంతేకాదు సిద్దార్థ్, జాన్వీ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉన్నాయి. వర్షంలో రొమాంటిక్ సన్నివేశాలు.. బాలీవుడ్ పాత పాటలను గుర్తుచేసేలా ఉన్నాయి. శ్రేయా ఘోషల్, అద్నాన్ సమీ కలిసి ఈ పాటను పాడారు. సచిన్-జిగర్ సంగీతం అందించారు. అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ రాశారు. సింగర్ అద్నాన్ సమీ చాలా కాలం తర్వాత మళ్ళీ ప్లే బ్యాక్ సింగర్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు.
Pyaar ki barsaat lekar, Bheegi bheegi saree is here… all set to drench your heart in love! 💓#BheegiSaree in the iconic voices of Shreya Ghoshal and Adnan Sami is OUT NOW! 💞
— Sidharth Malhotra (@SidMalhotra) August 8, 2025
🔗- https://t.co/gaunM4GEsl
The biggest love story of the year - #ParamSundari coming to cinemas on… pic.twitter.com/VvWCY13D81