/rtv/media/media_files/2025/08/09/mahesh-babu-pokiri-2025-08-09-12-56-09.jpg)
Mahesh Babu Pokiri
Mahesh Babu Globe Trotter: మీకు పండుగాడు గుర్తున్నాడా..? గుర్తులేడా.. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు, ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య.. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం... ఇప్పుడు గుర్తొచ్చి ఉంటాడు మీకు పండుగాడు.. ఈ డైలాగుల పవర్ అంతా ఇంతా కాదు
మనందరి మైండ్ లో అంతలా నాటుకుపోయిన సినిమా "పోకిరి"(Mahesh Babu Pokiri)... తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి అందుకు ఉదాహరణ మహేష్ బాబు హీరోగా వచ్చిన ఈ 'పోకిరి' సినిమా.. సాధారణంగా మనం ఏదైనా ట్విస్ట్ గురించి మాట్లాడేటప్పుడు, "పోకిరి లెవెల్ ట్విస్ట్ ఇది" అని అంటుంటాం.. అంతలా పోకిరి కథ జనాల్లో హృదయాల్లో గుర్తుండిపోయింది. టాలీవుడ్ లో మొట్టమొదట ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమా ఏది అంటే ముందు చెప్పాల్సిన సినిమా ‘పోకిరి’. అప్పట్లో ఈ సినిమా ఒక పెద్ద సంచలనమే సృష్టించింది.
అది 2006, ఏప్రిల్ 28.. మహేష్ బాబు హీరోగా 'పోకిరి' సినిమా అసలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. అసలు పోకిరి వచ్చినట్లు కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. మెల్లగా మొదటిరోజు సినిమా చూసిన వాళ్లంతా ఇదేం సినిమా రా బాబు అని నెగటివ్ గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా, మహేష్ బాబు లుక్స్, పూరి జగన్నాథ్ డైరెక్షన్, సినిమా టైటిల్ ఇలా చాలా విషయాల్లో సినిమాపై విమర్శలు చేశారు. విడుదలైన వారం పాటు ఫ్లాప్ టాక్ తోనే సినిమా నడిచింది. కానీ వారాం తర్వాత సినిమా టాక్ మొత్తం మారిపోయింది, ఫ్లాప్ అన్న ప్రతిఒక్కరి అంచనాలను తలకిందులు చేస్తూ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మహేష్ బాబుకి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ని సంపాదించి పెట్టింది. మహేష్ ని సూపర్ స్టార్ ని చేస్తూ తన కెరీర్ లో ఒక మరిచిపోలేని మైలురాయి అయ్యింది. అలాగే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టాలెంట్‌ను ఇండస్ట్రీకి మరోసారి చాటిచెప్పింది.
Also Read: దైవం మహేష్ రూపేణ.. హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్..
ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను..
పోకిరి సినిమా హైదరాబాద్ అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన కథ, మాస్ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్, రొమాన్స్, కామెడీ... అన్నీ కలిపి అసలైన కమర్షియల్ పాకేజీగా రూపొందింది. "ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను" అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ ఆ రోజుల్లో ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ కూడా ఆ డైలాగ్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది.
పోకిరి కథలో ముఖ్యంగా "పండుగాడు" అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మహేష్ బాబు కనిపిస్తాడు. డబ్బు కోసం ఏ పనైనా చేసే కిల్లర్‌గా చూపిస్తారు. కానీ కథలో ట్విస్ట్ ఏంటంటే, పండుగడు పోలీస్ అని క్లైమాక్స్‌లో రివీల్ చేస్తారు. ఆ ఒక్క క్లైమాక్స్ ట్విస్ట్ ప్రభంజనం సృష్టించింది. ఈ ట్విస్ట్‌తో పాటు స్క్రీన్‌ప్లే కూడా టాప్ క్లాస్ గా ఉండడం తో, సినిమా ఎక్కడ బోర్ కొట్టించదు. చివరి వరకూ థ్రిల్, సస్పెన్స్, ఎమోషన్.. అన్నీ కలిసి కథను పూరీ జగన్నాథ్ తన మార్క్ డైరెక్షన్‌తో, అదిరిపోయే పంచ్ డైలాగ్స్ తో అద్భుతంగా తెరకెక్కించాడు. మహేష్ నటన, యాటిట్యూడ్, ఫైట్స్‌లో పెర్ఫార్మెన్స్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది.
పాండుగాడు క్యారెక్టర్‌లో ఆయన చూపిన మాస్ అప్పీల్ అప్పట్లో అభిమానులను థియేటర్లకు పరుగులు తీయించింది. అలాగే, మహేష్ బాబు స్వాగ్, డైలాగ్ డెలివరీ ఈ సినిమాకు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తీసుకొచ్చింది.
అలాగే, పోకిరి విజయంలో మణిశర్మ సంగీతం కీలక పాత్ర పోషించింది. "జగడమే", "దేవుడా దేవుడా", "గలగల పారుతున్న గోదారిలా", "డోలే డోలే" పాటలు అప్పట్లో ఓ బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ అయ్యాయి. కేవలం పాటలే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయింది. అందుకే ఈ సినిమాను ఇప్పటికీ రీపీట్ లో చూసే జనాలు చాలా మందే ఉన్నారు.
అలాగే, ఇలియానా హీరోయిన్‌గా తన గ్లామర్‌తో పాటు మంచి పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ప్రకాశ్ రాజ్ విలన్‌గా కొత్త నటన చూపించాడు. బ్రహ్మానందం, ఆలీ, నాజర్, షాయాజీ షిండే, అజయ్ ఇలా ప్రతీ పాత్రకూ సరైన ప్రాముఖ్యత లభించిన సినిమా పోకిరి. ప్రతి క్యారెక్టర్ సినిమాకి తమ వంతు కంట్రిబ్యూషన్ ఇచ్చింది. అందుకే సినిమా ఎక్కడా స్లో అనిపించకుండా, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఇక రికార్డుల విషయానికొస్తే 200 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. పోకిరి మొదటి తెలుగు సినిమా 40కోట్ల షేర్ సాధించడం, ఇక ఇతర సినీ పరిశ్రమల్లో అనేక భాషల్లోకి రీమేకై అక్కడ కూడా ఘన విజయం సాధించడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ‘పోకిరి’ సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అందుకే పోకిరి ఒక ప్రభంజనం.. ఎవ్వరూ చెరపలేని, ఎప్పుడూ చెరిగిపోని రికార్డులు పోకిరికి సొంతం.