తెలంగాణ నేతల రాఖీ వేడుకలు .. చూసొద్దాం రండి
తెలంగాణలో ఘనంగా రక్షా బంధన్ వేడుకులు కొనసాగుతున్నాయి. వివిధ పార్టీ నేతలకు మహిళలు రాఖీలు కట్టి వారి మధ్య ఉన్న అప్యాయతను పంచుకుంటున్నారు. అన్నా, తమ్ముళ్లకు ఆడపడుచులు రాఖీలు కట్టారు.
తెలంగాణలో ఘనంగా రక్షా బంధన్ వేడుకులు కొనసాగుతున్నాయి. వివిధ పార్టీ నేతలకు మహిళలు రాఖీలు కట్టి వారి మధ్య ఉన్న అప్యాయతను పంచుకుంటున్నారు. అన్నా, తమ్ముళ్లకు ఆడపడుచులు రాఖీలు కట్టారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిగ్ బీ అమితాబచ్చన్ ను కలిశారు. ముంబైలోని ఆయన నివాసంలో అమితాబ్ తో దీదీ భేటీ అయ్యారు. బచ్చన్ కుటుంబ సభ్యులతో ఆమె కాసేపు ముచ్చటించారు. అనంతరం బిగ్ బీకి మమతా బెనర్జీ రాఖీ కట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను అమితాబచ్చన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
రక్షా బంధన్ రోజు బిల్కీస్ భానో, మహిళా రెజ్లర్లకు బీజేపీ నేతలు రాఖీ కట్టాలని ప్రతిపక్షాలు సూచించాయి. ఈ రోజు రక్షా బంధన్ అని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. బిల్కీస్ భానో, మహిళా రెజ్లర్లకు, మణిపూర్ మహిళలకు బీజేపీ నేతలు రాఖీలు కట్టాలన్నారు. వాళ్లంతా దేశంలో సురక్షితంగా వున్నామని ఫీల్ కావాలని చెప్పారు. అందుకే తామంతా కలిసి వచ్చామన్నారు. ఇండియా కూటమి సమావేశం నేపథ్యంలోనే గ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గించారని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు.
రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని అక్క, చెల్లెమ్మలకు శుభాకాంక్షలు చెప్పారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్. బుధవారం ట్వీట్వర్ వేదికగా జగన్ శుభాకాంక్షలు చెప్పారు. 'ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడిని. మీ సంక్షేమమే లక్ష్యంగా.. మీ రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తూ మీకు ఒక అన్నగా, తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉండానని మాట ఇస్తున్నా' అని పేర్కొన్నారు సీఎం జగన్.
రాఖీ పండుగ విశ్వవ్యాప్తమై చాలా ఏళ్లు అయ్యింది. ఇండియన్స్ ఎక్కుడ ఉంటే అక్కడ ఈ పండుగ కనిపిస్తుంది. భారతీయులను చూసి విదేశీయులు కూడా రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, యూఏఈ, నేపాల్, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, న్యూజిలాండ్, మలేషియా దేశాల్లో రాఖీ పండుగ కనిపిస్తుంది.
ప్రధాని మోడీకి రాఖీ సిస్టర్‌గా పిలవబడే పాకిస్థాన్ మహిళ కమర్ మొహిసిన్ షేక్ ఈ ఏడాది కూడా మోడీకి రాఖీ కట్టనున్నారు. ప్రధాని మోడీ కోసం తాను ఈ సారి ప్రత్యేకంగా రాఖీను తయారు చేసినట్టు ఆమె వెల్లడించారు. గత 30 ఏండ్లుగా ప్రధాని మోడీకి ఆమె రాఖీ కడుతున్నారు. ఈ సారి కూడా ఢిల్లీకి వచ్చి ప్రధాని మోడీకి రాఖీ కట్టేందుకు ఆమె రెడీ అవుతున్నారు.