టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు హీరో ప్రభాస్ (Prabhas). 45 ఏళ్ళు వచ్చినా ప్రభాస్ ఇంకా బ్యాచిలర్ గానే ఉంటున్నాడు. ప్రతీ ఇయర్ లో ప్రభాస్ పెళ్లి ఎప్పుడనేది అందరికీ ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ లాగా మిగిలిపోతుంది. ఇదిగో ప్రభాస్ పెళ్లి, అదిగో అమ్మాయి అంటూ ఇప్పటివరకు ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ ప్రభాస్ మాత్రం పెళ్లిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. Also Read : చెర్రీని తొక్కేసిన బన్నీ..! గేమ్ ఛేంజర్ పై నెట్టింట ట్రోల్స్ రచ్చ గణపవరంకి చెందిన అమ్మాయితో తాజాగా ప్రభాస్ పెళ్లిపై హీరో రామ్ చరణ్ (Ram Charan) అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు. గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య అన్ స్టాపబుల్ షోకి అతిథిగా వచ్చిన రామ్ చరణ్.. ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందంటూ మైండ్ బ్లోయింగ్ న్యూస్ చెప్పేశాడు. అంతేకాదండోయ్ అమ్మాయి వివరాలు కూడా లీక్ చేశాడు. తూర్పు గోదావరి జిలా గణపవరంకి చెందిన అమ్మాయితో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయినట్లుగా చరణ్ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. దీంతో ప్రభాస్ పెళ్లి ఎప్పుడనేది ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. మొత్తానికి ప్రభాస్ కు పెళ్లి కాబోతుంది అన్నది ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తుంది. ఇక ఇప్పటికే ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన రామ్ చరణ్, గోపీచంద్, అల్లు అర్జున్, శర్వానంద్ లాంటి హీరోలకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. ప్రభాస్ కూడా గోదావరి కుర్రాడే కావడం విశేషం. Also Read : "గేమ్ ఛేంజర్"పై చిరంజీవి సంచలన ట్వీట్.. వారందరి పేర్లు ప్రస్తావిస్తూ! ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. రాజాసాబ్, హనురాఘవపూడి సినిమా, సందీప రెడ్డి వంగా సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇవి కంప్లీట్ అయ్యాక సలార్ 2, కల్కి 2 సినిమాలు చేసే అవకాశం ఉంది. మరి ఇంతటి బిజీ షెడ్యూల్ మధ్య ప్రభాస్ పెళ్లి ఎప్పుడునేది మరో ఇంట్రెస్టి్ంగ్ పాయింట్. Also Read : హీరోయిన్ సమంత షాకింగ్ న్యూస్ Also Read : మరోసారి ఆ సాధువును కలిసిన విరుష్క జోడీ.. మళ్లీ అదే కారణమట!