SSMB29 Movie Updates: తొలిసారి మీడియా ముందుకు మహేష్- రాజమౌళి.. మ్యాటర్ ఏంటంటే..?

SSMB29 రాజమౌళి- మహేష్ కాంబోలో వస్తున్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 2nd షెడ్యూల్ జరుపుకొంటుంది. తదుపరి షెడ్యూల్ కోసం యూనిట్ విదేశాలకు వెళ్లనున్నారు. వెళ్లే ముందు హైదరాబాద్‌లోని స్థానిక, జాతీయ మీడియాతో సమావేశం జరపనున్నారు.

New Update
SSMB29 Movie Updates

SSMB29 Movie Updates Photograph: (SSMB29 Movie Updates)

SSMB29 Movie Updates: ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), మహేష్ బాబు(Mahesh Babu), ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కాంబోలో వస్తున్న  SSMB29 గురించి ఎప్పుడు ఇదొక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఒక్క తెలుగులోనే కాదు ప్రపంచహా వ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతగానో ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. SSMB29 మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని, రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుపుకొంటుంది. మహేష్, ప్రియాంక, ఇతర తారాగణం సభ్యులు పాల్గొనే అనేక కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ వివరాలను యూనిట్ చాలా సీక్రెట్ గా మైంటైన్ చేస్తుంది.

Also Read: మైనర్‌ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

త్వరలో హై-ప్రొఫైల్ మీడియా ఇంటరాక్షన్..

ఫిల్మ్ సర్కిల్స్‌లో తాజా సమాచారం ప్రకారం, SSMB29 రెండవ షెడ్యూల్ త్వరలో పూర్తిచేసుకొని మార్చిలో తదుపరి షెడ్యూల్ కోసం యూనిట్ విదేశాలకు వెళ్లనున్నారు. తాజా సమాచారం ప్రకారం మహేష్, రాజమౌళి విదేశాలకు వెళ్లే ముందు హైదరాబాద్‌లోని స్థానిక, జాతీయ మీడియాతో సంభాషించనున్నారు. ఈ హై-ప్రొఫైల్ మీడియా ఇంటరాక్షన్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Also Read: సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్.. SLBC ఘటనపై ఏం చెప్పారంటే!

SSMB29 ప్రపంచాన్ని చుట్టివచ్చే అడవి సాహసయాత్ర ఆధారంగా ఉండబోతుంది అని ఇప్పటికే ప్రచారం సాగుతుంది. ఈ చిత్రాన్ని కెఎల్ నారాయణ రూ. 1,000 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు, ఇది భారతదేశంలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రంగా నిలిచింది. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికి మహేష్ అభిమానులు, ప్రపంచ సినిమా అభిమానులు మాత్రం ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. SSMB29తో రాజమౌళి తన పాత రికార్డులు అన్ని తిరగరాయడం మాత్రం పక్కా అని తెలుస్తోంది. 

Also Read: MLC ఎన్నికలకు దూరం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన!

Also Read: సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్.. SLBC ఘటనపై ఏం చెప్పారంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు