Raja Saab: రాజా సాబ్ డబుల్ ధమాకా.. బ్యాక్ టు బ్యాక్ రెండు ఈవెంట్లు..!

ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదలవుతుందని మేకర్స్ స్పష్టం చేశారు. మారుతి దర్శకత్వంలో హారర్, కామెడీ, రొమాన్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు యూఎస్‌, ఏపీలో రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

New Update
Raja Saab

Raja Saab

Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్(prabhas) నటిస్తున్న కొత్త సినిమా ‘ది రాజాసాబ్’పై వచ్చిన వాయిదా వార్తలకు చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది. ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానుల్లో నెలకొన్న సందేహాలు పూర్తిగా తొలగిపోయాయి.

దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం హారర్, కామెడీ, రొమాన్స్ కలయికతో రూపొందుతోంది. ప్రభాస్ ఈ సినిమాలో పూర్తి వినోదాత్మక పాత్రలో కనిపించనున్నారని చిత్ర బృందం చెబుతోంది. గత కొంతకాలంగా సినిమా ఆలస్యం అవుతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ, ఇప్పుడు నిర్మాతలు మరోసారి రిలీజ్ డేట్‌ను ఖరారు చేస్తూ క్లారిటీ ఇచ్చారు.

Also Read :  'ధురంధర్' తెలుగు రిలీజ్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Raja Saab Movie Team

‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్, భారీ సినిమాలతో పాటు ప్రేక్షకులను నవ్వించే కథలకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ క్రమంలోనే మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘ది రాజాసాబ్’పై మొదటి నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ మారుతి కలయికలో ఫన్ ఎంటర్‌టైనర్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారర్ నేపథ్యంతో కూడిన కథలో కామెడీ, రొమాన్స్‌ను చక్కగా కలిపి, ప్రభాస్‌ను కొత్త కోణంలో చూపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఇక ప్రమోషన్ల విషయానికి వస్తే, మేకర్స్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ‘ది రాజాసాబ్’ కోసం రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించాలనే ప్లాన్‌లో చిత్ర బృందం ఉంది. ఒక ఈవెంట్‌ను అమెరికాలో, మరొకదాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ లేదా విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 27న ఈ ఈవెంట్లలో ఒకటి జరిగే అవకాశం ఉందని సమాచారం.

ప్రభాస్‌కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని విదేశాల్లో కూడా ప్రమోషన్లు చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. రిలీజ్ డేట్ క్లారిటీతో పాటు, రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్ల వార్తతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పుడు అందరి దృష్టి సంక్రాంతి రేసులో ‘ది రాజాసాబ్’ ఎలాంటి ఫలితం అందుకుంటుందన్నదానిపై ఉంది. - tollywood-news-in-telugu

Also Read :  హాట్ అలర్ట్.. గ్లామర్ షోతో మతిపోగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ

Advertisment
తాజా కథనాలు